Madhya Pradesh: 4 నెలల క్రితం ఇంట్లోంచి జంప్.. కట్ చేస్తే అస్థిపంజరాలై..
ABN, Publish Date - Jun 19 , 2024 | 08:34 PM
ఆమెకు పెళ్లైంది భర్త ఉన్నాడు.. అతనికీ పెళ్లైంది భార్య ఉంది.. కానీ, ఆమెకు, అతనికి మధ్య ఉన్న బంధుత్వం కాస్తా.. అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ సంబంధమే వారిద్దరినీ ఇంట్లోంచి పారిపోయేలా చేసింది. కానీ, వారికి ఆ హ్యాపినెస్ ఎక్కువ కాలమేమీ లేదు. ఇంట్లోంచి వెళ్లిపోయిన వారు చివరికి అస్థిపంజరాలై ..
భోపాల్, జూన్ 19: ఆమెకు పెళ్లైంది భర్త ఉన్నాడు.. అతనికీ పెళ్లైంది భార్య ఉంది.. కానీ, ఆమెకు, అతనికి మధ్య ఉన్న బంధుత్వం కాస్తా.. అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ సంబంధమే వారిద్దరినీ ఇంట్లోంచి పారిపోయేలా చేసింది. కానీ, వారికి ఆ హ్యాపినెస్ ఎక్కువ కాలమేమీ లేదు. ఇంట్లోంచి వెళ్లిపోయిన వారు చివరికి అస్థిపంజరాలై తేలారు. కారులో ప్రయాణిస్తూ నదిలో పడిపోయిన వీరు.. 4 నెలల తరువాత అస్థిపంజరాలై తేలారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మహారాష్ట్రకు చెందిన జంట.. మధ్యప్రదేశ్‌లోని గోపి గ్రామ సమీపంలో క్వారీ నదిపై నిర్మించిన మినీ డ్యామ్‌లో అస్థిపంజరమై తేలింది. ఇల్లీగల్ రిలేషన్‌లో ఉన్న ఈ జంట.. 4 నెలల క్రితం అదృశ్యమవగా.. ఇప్పుడు నదిలో ఎముకల గూడుగా దోరికారు. డ్యామ్‌లోని నీటిని ఖాళీ చేస్తుండగా అందులో మునిగిపోయిన కారు బయటకు కనిపించింది. ఆ కారును పరిశీలిస్తే అందులో రెండు అస్తిపంజరాలు కనిపించాయి. ఘటనాస్థలికి వచ్చి పరిశీలించిన పోలీసులు అసలేం జరిగిందా? అని ఆరా తీయగా సినిమాను మించిన ట్విస్ట్‌లు వెలుగు చూసింది. అసలు ఈ జంట ఎవరు? ఈ కారు ఎవరిది? నదిలో వారి కారు ఎలా పడిపోయింది? ఎవరైనా తోసేశారా? ప్రమాదం జరిగిందా? ఆత్మహత్య చేసుకున్నారా? హత్య చేశారా? ఇప్పుడివే పోలీసులను తొలచివేస్తున్న ప్రశ్నలు..
మధ్యప్రదేశ్‌లోని గోపి గ్రామ సమీపంలోని క్వారీ నదిపై నిర్మించిన డ్యామ్‌లో ఓ కారు కనిపించింది. మినీ డ్యామ్‌లోని నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో డ్యామ్‌లో నీటిమట్టం తగ్గిపోగా.. అందులో కారు కనిపించింది. కారు మొత్తం నాచుతో ఉంది. వెంటనే గ్రామస్తులు సిహోనియా పోలీసులకు సమాచారం అందజేశారు. వారు జేసీబీ సహాయంతో కారును వెలికి తీశారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ MH 03 BC-8720. ఈ కారులో రెండు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. ఈ కారు నెంబర్ ఆధారంగా కూపీ లాగితే.. అసలు విషయం బయటపడింది. కారులో చనిపోయిన వారిద్దరూ మిథిలేష్, నీజ్ జాతవ్‌ల గుర్తించారు. ఫిబ్రవరి 6, 2024న ముఖేష్ అనే వ్యక్తి తన భార్య మిథిలేష్ కనిపించడం లేదంటూ అంబాహ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే, మిథిలేష్‌తో పాటు.. నీరజ్ జాతవ్ కూడా కనిపించడం లేదని.. ఇద్దరూ కలిసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. తాజాగా బయటపడిన కారు నెంబర్ ఆధారంగా కూపీలాగగా.. కారులోని అస్థిపంజరాలు మిథిలేష్, నీజ్ జాతవ్‌లవిగా గుర్తించారు.
అయితే, వీరిది హత్యా, ఆత్మహత్యా, ప్రమాదమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్యామ్ కాజ్‌వేపై ఎలాంటి రెయిలింగ్ గానీ లేదు. దీంతో కారు అదుపుతప్పి నీటిలో పడిపోయిందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అడిషనల్ ఎస్పీ అరవింద్ ఠాకూర్ మాట్లాడుతూ.. కారులోని మహిళను ఆమె భర్త ముఖేష్ దుస్తుల ఆధారంగా గుర్తించారని చెప్పారు. అయితే, సమగ్ర నిర్ధారణ కోసం రెండు అస్థిపంజరాల అవశేషాల డీఎన్‌ఏ నమునాలను ల్యాబ్‌కు పంపించామని చెప్పారు ఏఎస్పీ. అయితే, వంతెన రెయిలింగ్‌పై ప్రమాద గుర్తులు కనిపించాయని.. కారు ప్రమాదవశాత్తు నదిలో పడిపోయి ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుపుతున్నామని ఏఎస్పీ తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పారు.
For More National News and Telugu News..
Updated Date - Jun 19 , 2024 | 08:35 PM