ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National: మాయావతికి అఖిలేష్ మద్దతు.. కృతజ్ఞతలు తెలిపిన మాజీ సీఎం

ABN, Publish Date - Aug 24 , 2024 | 04:17 PM

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు.

Akhilesh and Mayawati

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు. అదేంటి మాయావతికి అఖిలేష్ మద్దతుగా నిలవడం ఏమిటనుకుంటున్నారా.. ఇది నిజం. యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు మాజీ సీఎం మాయావతిని అవినీతిపరురాలిగా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన అఖిలేష్ యాదవ్ మాయావతిని సమర్థిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండించారు. ఈ పరిణామం యూపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ కలిసి పోటీచేయగా.. బీఎస్పీ ఒంటరిగా పోటీచేసింది. ఊహించిన దానికంటే ఇండియా కూటమి మంచి ఫలితాలను సాధించింది. దీంతో రానున్న యూపీ శాసనసభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అఖిలేష్ యాదవ్ సైతం రానున్న అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. బీఎస్పీ లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోకపోయినా.. 9.39 శాతం ఓట్లను సాధించింది. దాదాపు 82 లక్షల 33వేల ఓట్లను సాధించింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి ఇండియా కూటమిలో కలిస్తే ఎన్డీయే కూటమిని సులభంగా ఓడించవచ్చనే ఉద్దేశంతోనే అఖిలేష్ యాదవ్.. మాయావతికి మద్దతుగా నిలిచారనే చర్చ సాగుతోంది. అఖిలేష్‌ స్పందనకు మాయావతి సైతం కృతజ్ఞతలు తెలిపారు.

Hyderabad: ముంబై-హైదరాబాద్.. మధ్యలోనే కుప్పకూలిన హెలికాప్టర్..


అసలు ఏం జరిగిందంటే..

మంథ్ బీజేపీ ఎమ్మెల్యే రాజేష్ చౌదరి ఒక చర్చలో బీఎస్పీ అధినేత్రి మాయావతి అత్యంత అవినీతిపరురాలైన సీఎం అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అఖిలేష్ యాదవ్ రాజేష్ చౌదరిని బిజెపి నుండి బహిష్కరించాలని.. అతనిపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ మహిళా ముఖ్యమంత్రి పట్ల బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడిన తీరు అభ్యంతరకరమన్నారు. ఈ వ్యాఖ్యలను చూస్తుంటు మాటలు మహిళల పట్ల, ముఖ్యంగా అణగారిన వర్గాల పట్ల బీజేపీకి ఎంత ద్వేషం ఉందో తెలియజేస్తోందని అఖిలేష్ యాదవ్ అన్నారు. రాజకీయంగా తమకు బీఎస్పీకి విభేదాలు ఉండవచ్చని.. కానీ ఒక మహిళగా ఆమె గౌరవాన్ని ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని అఖిలేష్ యాదవ్ అన్నారు. మాయావతిని ముఖ్యమంత్రిని చేసి యూపీ ప్రజలు తప్పు చేశారని బీజేపీ నాయకులు అంటున్నారని.. ఇది కూడా ప్రజాస్వామ్య దేశంలో ప్రజాభిప్రాయాన్ని అవమానించడమేనని అఖిలేష్ పేర్కొన్నారు. మాయావతి అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అని ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపించడం చాలా అభ్యంతరకరమని, బీజేపీ ఎమ్మెల్యేపై పరువునష్టం కేసు పెట్టాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.

Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో ట్విస్ట్.. నా కొడుకు నిర్దోషి అంటున్న నిందితుడి తల్లి


మాయావతి కృతజ్ఞతలు

అఖిలేష్ స్పందనపై మాయావతి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే రాజేష్ చౌదరిపై బిజెపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే బీఎస్పీపై చేసిన తప్పుడు ఆరోపణలపై స్పందించి అఖిలేష్ యాదవ్ తగిన సమాధానం ఇచ్చారని మాయావతి పేర్కొన్నారు. తాను నిజాయితీపరుడనే వాస్తవాన్ని అంగీకరించినందుకు తమ పార్టీ ఎస్పీ చీఫ్‌కు కృతజ్ఞతలు తెలుపుతోందన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై బీజేపీ చర్యలు తీసుకోవాలని, అతడి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేకపోతే సరైన చికిత్స అందించాలంటూ మాయావతి ఎద్దెవా చేశారు. లేదంటే ఈ వ్యాఖ్యల వెనుక బీజేపీ కుట్ర దాగి ఉందని అనుమానించాల్సి వస్తుందన్నారు.


Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 24 , 2024 | 04:17 PM

Advertising
Advertising
<