Special train: సికింద్రాబాద్-వేలాంకన్ని మధ్య ప్రత్యేక రైళ్లు
ABN, Publish Date - Aug 15 , 2024 | 01:08 PM
వేలాంకన్ని ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్(Secunderabad) నుంచి వేలాంకన్నికి ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.
చెన్నై: వేలాంకన్ని ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్(Secunderabad) నుంచి వేలాంకన్నికి ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది. నెం.07125 సికింద్రాబాద్-వేలాంకన్ని(Secunderabad- Velankanni) ప్రత్యేక రైలు ఈ నెల 27, సెప్టెంబరు 4 తేదీల్లో సికింద్రాబాద్‌లో ఉదయం 8.25 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.30 గంటలకు వేలాంకన్ని చేరుకుంటుంది. మరుమార్గంలో నెం.07126 వేలాంకన్ని-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 28, సెప్టెంబరు 5 తేదీల్లో వేలాంకన్నిలో రాత్రి 10.45 గంటలకు బయల్దేరి మూడో రోజు వేకువజామున 3 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైతు నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, వేలూరు కంటోన్మెంట్(Nellore, Gudur, Renigunta, Katpadi, Vellore Cantonment) మీదుగా వేలాంకన్ని వెళ్లనుంది.
ఇదికూడా చదవండి: Chennai: ఒక్క దళితుడు కూడా ముఖ్యమంత్రి కాలేదు..
.................................................................
ఈ వార్తను కూడా చదవండి:
..................................................................
DMK: డీఎంకేలో భారీ మార్పులు..
- 2 నియోజకవర్గాలకు ఓ జిల్లా కార్యదర్శి
చెన్నై: రాబోవు శాసనసభ ఎన్నికలల్లోనూ మరోమారు విజయం సాధించే దిశగా డీఎంకే(DMK)లో భారీగా మార్పులు జరుగనున్నాయి. పార్టీలోని వివిధ విభాగాలకు నూతన జవసత్వాలు కల్పించేందుకు పార్టీ అధ్యక్షుడు స్టాలిన్(President Stalin) సహా సీనియర్ నేతలు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం డీఎంకే సంస్థాగత పరంగా 72 జిల్లాల కార్యదర్శులున్నారు. వీరిలో సీనియర్ మంత్రులు, సీనియర్ జిల్లా కార్యదర్శులున్న జిల్లాల్లో ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. తక్కిన పార్టీ జిల్లాల్లో రెండు మూడు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పార్టీని మరింత విస్తృతపరిచేందుకు చెన్నైలో మూడు శాసనసభ నియోజకవర్గాలకు ఓ జిల్లా కార్యదర్శి చొప్పున నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయిచింది.
ఈ వార్తను కూడా చదవండి: Actor Dalapathy Vijay: విక్రవాండిలో వీకే తొలి మహానాడు..
ఇతర జిల్లాల్లో రెండు శాసనసభ నియోజకవర్గాలకు ఓ జిల్లా కార్యదర్శి చొప్పున నియమించనుంది. ఆ మేరకు పార్టీలో 117 జిల్లా కార్యదర్శులను నియమించేందుకు అధిష్టానం వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతం యువజన సంక్షేమం, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి కొత్తగా జిల్లా కార్యదర్శులను నియమించే విషయమై అన్ని జిల్లాల నాయకులతో సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆ ప్రకారం రూపొందించిన నివేదికను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు ఆయన త్వరలో అందించనున్నారు.
ఆ ప్రకారం ప్రస్తుతం మంత్రి పీకే శేఖర్ బాబు ఇన్‌ఛార్జిగా ఉన్న చెన్నై ఈస్ట్ జిల్లాను రెండు శాఖలుగా విభజించనున్నారు. మంత్రి సుబ్రమణ్యం ఇన్‌ఛార్జిగా ఉన్న చెన్నై సౌత్ జిల్లా, మంత్రి దామో అన్బరసన్ ఇన్‌ఛార్జిగా ఉన్న కాంచీపురం నార్త్ జిల్లాను విభజించి కొత్తగా మరికొన్ని జిల్లా శాఖలు ఏర్పాటు చేయనున్నారు. తెన్‌కాశి, విరుదునగర్, కన్నియాకుమారి, శివగంగ, రామనాధపురం జిల్లాలు సమా పలు జిల్లాల్లోనూ జిల్లా శాఖలను విభజించి కొత్తశాఖలు ఏర్పాటు చేసి జిల్లా శాఖ కార్యదర్శుల సంఖ్యను పెంచనున్నారు.
ఒలింపిక్స్ క్రీడలకు వెళ్ళిన మంత్రి ఉదయనిధి బుధవారం నగరానికి తిరిగిరానున్నారు. ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో డీఎంకే సమన్వయకమిటీ సమావేశం ఆయన అధ్యక్షతన జరుగనుంది. ఆ సమావేశంలో పార్టీలో కొత్త జిల్లా శాఖలను ఏర్పాటు చేసే విషయమై సమగ్రంగా చర్చించనున్నారు. ఈనెల 16న జరుగనున్న డీఎంకే జిల్లా కార్యదర్శుల సమావేశంలో 2026 శాసనసభ ఎన్నికల వ్యూహరచనలపై కూడా సమీక్ష జరుపనున్నారని తెలుస్తోంది.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...
Read Latest Telangana News and National News
Updated Date - Aug 15 , 2024 | 01:08 PM