Katchateevu: కచ్చతీవు పై భారత్‌కు ఎలాంటి ఆధారం లేదు.. శ్రీలంక సంచలన ప్రకటన
ABN , Publish Date - Apr 05 , 2024 | 11:39 AM
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) కచ్చతీవు దీవులపై చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షమైన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) కచ్చతీవు దీవులపై చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీ, మిత్రపక్షమైన ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని తీవ్ర వ్యా్ఖ్యలు చేశారు. జాతీయ ప్రయోజనాలను విస్మరించి కచ్చతీవు దీవులను శ్రీలంకకు అప్పగించారని మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో కచ్చతీవు అంశం హాట్ టాపిక్‌గా మారడంపై శ్రీలంక స్పందంచింది. ఆ దీవి తమదేనని, తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారతదేశం వద్ద ఏ ఆధారం లేదని ఆ దేశ మంత్రి డగ్లస్ దేవానంద తెలిపారు. భారత్ చేసే ఏ ప్రయత్నాన్నైనా తాము సమర్థించడం లేదని ఖండించారు.
Navneeth Kaur: నా పుట్టుక గురించి ప్రశ్నించిన వారికి సమాధానం లభించింది.. ఎంపీ నవనీత్..
"ఇప్పుడు భారతదేశంలో ఎన్నికల సమయం. ప్రస్తుత తరుణంలో కచ్చతీవు గురించి ఇలాంటి వాదనలు మేము ఊహించలేదు. తన ప్రయోజనాలకు అనుగుణంగా భారతదేశం వ్యవహరిస్తోంది. 1974 ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మత్స్యకారులు ఈ ప్రాంతాల్లో చేపలు పట్టవచ్చు. కానీ ఆ ఒప్పందం 1976లో సవరణకు గురైంది. దీని ప్రకారం ఇరు దేశాల మత్స్యకారులు పొరుగు జలాల్లో చేపల వేటను నిషేధించారు."
- డగ్లస్ దేవానంద, శ్రీలంక మంత్రి
Congress: నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. వాటిపైనే ప్రధాన దృష్టి..కాగా కచ్చతీవు వ్యవహారంపై విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. ఇది అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదని చెప్పారు. పార్లమెంట్‌లో కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉందన్నారు. ఆ రాష్ట్ర సీఎంకు 21 సార్లు సమాధానమిచ్చినట్లు వెల్లడించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.