ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Srinagar : పాక్‌ ‘బ్యాట్‌’ దళం దాడిలో భారత జవాను మృతి

ABN, Publish Date - Jul 28 , 2024 | 04:08 AM

పాకిస్థాన్‌ ప్రత్యేక సైన్యంతోపాటు ఉగ్రవాదులతో కూడిన ‘బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌’ (బ్యాట్‌ దళం) భారత ఆర్మీ పోస్టుపై చేసిన అకస్మాత్తు దాడిలో ఓ జవాను మృతి చెందగా, కెప్టెన్‌ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

  • కెప్టెన్‌ సహా నలుగురికి గాయాలు.. సరిహద్దుల్లో భద్రత పెంపునకు కేంద్రం నిర్ణయం

శ్రీనగర్‌, జూలై 27: పాకిస్థాన్‌ ప్రత్యేక సైన్యంతోపాటు ఉగ్రవాదులతో కూడిన ‘బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌’ (బ్యాట్‌ దళం) భారత ఆర్మీ పోస్టుపై చేసిన అకస్మాత్తు దాడిలో ఓ జవాను మృతి చెందగా, కెప్టెన్‌ సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని కామకారి సెక్టర్‌ వద్ద శనివారం ఈ దాడి జరిగింది.

నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఆర్మీ పోస్టుపై బ్యాట్‌ దళం ఒక్కసారిగా గ్రేనేడ్‌తో దాడి చేసి కాల్పులు జరిపింది. ఈ దాడిలో కెప్టెన్‌ సహా ఐదుగురు జవాన్లు గాయపడగా వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ ఓ జవాను ప్రాణాలు విడిచాడని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బ్యాట్‌ దళం చేసిన దాడికి ప్రతిగా భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ పాక్‌ చొరబాటుదారుడు మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు.

మరోవైపు భారత్‌- పాక్‌ సరిహద్దు వెంబడి ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతను పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఒడిసాలోని మల్కాంగిరి నుంచి జమ్మూకశ్మీర్‌లోని కిశ్వార్‌, కథువా, రియాసీ వెంబడి సరిహద్దుల్లోకి 2వేల మంది సరిహద్దు భద్రతా దళ సిబ్బందిని మోహరిస్తున్నట్లు పేర్కొంది.

Updated Date - Jul 28 , 2024 | 04:08 AM

Advertising
Advertising
<