ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sumalatha: ఇంకా టిక్కెట్ ఇవ్వలేదు.. త్వరలోనే నిర్ణయం వెల్లడిస్తా.. సుమలత కామెంట్స్..

ABN, Publish Date - Mar 30 , 2024 | 09:59 PM

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ( Lok Sabha Elections ) సమయం దగ్గర పడుతున్న పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అభ్యర్థుల ప్రకటనలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అవసరమైతే సిట్టింగ్ ఎంపీలకు కాకుండా కొత్త వారికి ఎంపీ టిక్కెట్ ఇస్తున్నారు.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు ( Lok Sabha Elections ) సమయం దగ్గర పడుతున్న పరిస్థితుల్లో ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అభ్యర్థుల ప్రకటనలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. అవసరమైతే సిట్టింగ్ ఎంపీలకు కాకుండా కొత్త వారికి ఎంపీ టిక్కెట్ ఇస్తున్నారు. భారతదేశంలో కర్ణాటకలోని మండ్య లోక్ సభ స్థానం పరిచయం అవసరం లేని పేరు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీ(ఎస్) ఈ నియోజకవర్గం నుంచి హెచ్‌డీ కుమారస్వామిని పోటీకి దించాలని నిర్ణయించుకున్నాయి. దీంతో సిట్టింగ్ ఎంపీ సుమలతకు టిక్కెట్ దక్కలేదు. ఈ పరిణామాల నడుమ సుమలత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా మండ్య ఓటర్లకు తెలియజేయడం తన కర్తవ్యమని, టిక్కెట్ దక్కకపోవడంపై ఏప్రిల్ 3 న తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని అన్నారు.

Trending: అదంతే.. సీరియల్ లో పెళ్లి చేసుకుంటే.. నిజ జీవితంలోనూ చేసుకున్నట్లే..!

2019 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ మద్దతుతో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. మాజీ ప్రధాని, జేడీ(ఎస్) పితామహుడు హెచ్‌డీ దేవెగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామిని సుమలత ఓడించారు. అదే జేడీ(ఎస్) ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. కుమారస్వామిని ఎన్‌డీఎ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సుమలతతో సంప్రదింపులు జరిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర ప్రయత్నించినా.. కార్యకర్తలతో మాట్లాడాకే తన నిర్ణయం వెల్లడిస్తానని తెలిపారు.

Kerala: మదర్సా టీచర్ హత్య కేసు.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..


శనివారం తన మద్దతుదారులతో సుమలత సమావేశమయ్యారు. వారి ఆశీస్సులతోనే తన రాజకీయ జీవితం ప్రారంభమైందన్నారు. తనకు అండగా నిలిచిన తన భర్త దివంగత అంబరీష్ అభిమానులనూ ఆమె ప్రశంసించారు. తనకు రాజకీయ అనుభవం లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆత్మవిశ్వాసం ఇచ్చింది వారేనని సుమలత అన్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 30 , 2024 | 09:59 PM

Advertising
Advertising