Summer special trains: నరసాపురం- బెంగళూరు మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు
ABN, Publish Date - May 01 , 2024 | 01:38 PM
వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నరసాపురం- బెంగళూరు (వయా. కాట్పాడి, జోలార్‌పేట) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు.
చెన్నై: వేసవి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నరసాపురం- బెంగళూరు (వయా. కాట్పాడి, జోలార్‌పేట) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. నెం.07153 నరసాపురం- బెంగుళూరు(Narasapuram-Bangalore) ప్రత్యేక రైలు ఈనెల 3,10,17,24,31, జూన్ 7,14,21,28 (శుక్రవారం) తేదీల్లో నరసాపురంలో మధ్యాహ్నం 3.50 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. మరుమార్గంలో నెం.07153 బెంగళూరు-నరసాపురం ప్రత్యేక రైలు ఈనెల 4,11,18,25, జూన్ 1,8,15,22,29 (శనివారం) తేదీల్లో ఉదయం 10.50 గంటలకు బెంగళూరులో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6 గంటలకు నరసాపురం చేరుకుంటుంది.
ఇదికూడా చదవండి: Etala Rajender: రాష్ట్ర ప్రభుత్వం వద్ద అప్పులే తప్ప నిధులు లేవు..
తాంబరం-సంత్రాగచ్చి... : నెం.06089 తాంబరం-సంత్రాగచ్చి వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 81,5,22,29 (బుధవారం) తేదీల్లో తాంబరం నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయల్దేరి మరుసటిరోజు రాత్రి 9.20 గంటలకు సంత్రాగచ్చి చేరుకుంటుంది. మరుమార్గంలో నెం.06090 సంత్రాగచ్చి-తాంబరం వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 9,16,23,30 (గురువారం) తేదీల్లో రాత్రి 10.40 గంటలకు సంత్రాగచ్చిలో బయల్దేరి మూడో రోజు ఉదయం 9.45 గంటలకు తాంబరం చేరుకుంటుంది.
ఇదికూడా చదవండి: Secunderabad-Ramanadhapuram: సికింద్రాబాద్-రామనాథపురం రైలు సేవల పొడిగింపు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 01 , 2024 | 01:38 PM