ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మనోవర్తి నిర్ధారణకు 8 సూత్రాలు

ABN, Publish Date - Dec 13 , 2024 | 05:28 AM

విడాకులు మంజూరు చేసే సమయంలో భార్యకు చెల్లించాల్సిన శాశ్వత మనోవర్తిని నిర్ణయించే సమయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.

  • మార్గదర్శకాలు జారీ చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, డిసెంబరు 12: విడాకులు మంజూరు చేసే సమయంలో భార్యకు చెల్లించాల్సిన శాశ్వత మనోవర్తిని నిర్ణయించే సమయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. భర్త చెల్లించాల్సిన మనోవర్తి అతడిని శిక్షించే విధంగా ఉండకూడదని, అదే సమయంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే విధంగా భార్యకు చెల్లింపులు జరపాల్సి ఉంటుదని తెలిపింది. ఇందుకు ఎనిమిది సూత్రాల విధానాన్ని సూచిస్తూ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ ప్రసన్న బి వరాలే ధర్మాసనం తీర్పు చెప్పింది. ఓ జంట ఆరేళ్ల పాటు కలిసి ఉండి, అనంతరం దాదాపు రెండు దశాబ్దాల పాటు విడిగా జీవించింది. చివరకు విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. వాదనలు విన్న ధర్మాసనం తుది మనోవర్తి నిర్ధారించే సమయంలో గమనించాల్సిన అంశాలపై మార్గదర్శకాలు ఇచ్చింది.


  • భార్య, భర్తల ఆర్థిక, సామాజిక హోదా

  • భార్య, ఆమెపై ఆధారపడ్డ పిల్లల హేతుబద్ధమైన అవసరాలు

  • ఆ జంట విద్యార్హతలు, ఉద్యోగాల హోదా

  • భార్యకు ఉన్న సొంత ఆదాయం, ఆస్తులు

  • అత్తవారింటిలో భార్య అనుభవించిన జీవన ప్రమాణాలు

  • కుటుంబ బాధ్యతల కోసం ఆమె ఉద్యోగాన్ని త్యాగం చేసి ఉంటే ఆ వివరాలు...

  • భార్య ఎలాంటి ఉద్యోగం చేయకుంటే కోర్టుల్లో న్యాయం కోసం ఆమె చేసిన వ్యయం...

  • భర్త ఆదాయం, రుణాలు, మనోవర్తి భారం... తదితర అంశాలను పరిగణనలోకి

    తీసుకోవాలని సూచించింది. అన్ని కోర్టులు కూడా ఈ మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. అయితే మనోవర్తి నిర్ధారణకు కచ్చితమైన సూత్రం అంటూ ఏమీ ఉండదని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Updated Date - Dec 13 , 2024 | 05:28 AM