కాలుష్యాన్ని ఏ మతమూప్రోత్సహించదు
ABN, Publish Date - Nov 12 , 2024 | 04:22 AM
కాలుష్యాన్ని పెంచే కార్యక్రమాలను ఏ మతమూ ప్రోత్సహించదని సోమవారం వ్యాఖ్యానించింది.
ఢిల్లీలో ఏడాదంతా బాణసంచా నిషేధంపై నిర్ణయం తీసుకోండి: సుప్రీం
న్యూఢిల్లీ, నవంబరు 11: కాలుష్యాన్ని పెంచే కార్యక్రమాలను ఏ మతమూ ప్రోత్సహించదని సోమవారం వ్యాఖ్యానించింది. ఏడాది పొడవునా బాణసంచాను నిషేధించడంపై పక్షం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. దేశ రాజధాని పరిసరాల్లో వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని కోరుతూ 1985లో పర్యావరణవేత్త ఎం.సి.మెహతా దాఖలు చేసిన పిటిషన్‌పై జరిగిన విచారణలో భాగంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కాలుష్యరహిత వాతావరణంలో జీవించడం పౌరుల ప్రాథమిక హక్కని తెలిపింది. ఏడాదంతా బాణసంచా నిషేధంపై భాగస్వాములందరితో చర్చించి ఈ నెల 25లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Updated Date - Nov 12 , 2024 | 04:22 AM