Karnataka High Court: న్యాయమూర్తి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ .. స్పందించిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Sep 20 , 2024 | 02:55 PM
కర్ణాటక హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా జడ్జి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అంశంపై వెంటనే నివేదిక అందజేయాలని కర్ణాటక హైకోర్టును సుప్రీంకోర్టు కోరింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: కర్ణాటక హైకోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా జడ్జి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సుప్రీంకోర్టు స్పందించింది. ఈ అంశంపై వెంటనే నివేదిక అందజేయాలని కర్ణాటక హైకోర్టును సుప్రీంకోర్టు కోరింది. న్యాయ వ్యవస్థ హుందాతనాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఎంతయిన ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై. చంద్రచూడ్ అధ్యక్షతన నలుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది.
Also Read: Pitru Pakshalu 2024: పితృపక్ష దోష నివారణకు ఇదే సమయం.. పురుషులు అసలు చేయకూడని పనులు
Also Read: Thailand: కొండ చిలువతో వృద్దురాలు రెండు గంటల పోరాటం.. చివరకు ఏం జరిగిందంటే..?
యజమానికి, కిరాయిదారుడికి సంబంధించిన వివాదంపై కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ వేదవేసాచార్ శ్రీశానంద.. మాట్లాడుతూ బెంగళూరులో ముస్లింల అత్యధిక ప్రాబల్యమున్న ప్రాంతాన్ని పాకిస్తాన్ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఓ మహిళా న్యాయవాదితో ఆయన ద్వేష పూరిత వ్యాఖ చేశారు. జస్టిస్ శ్రీశానంద చేసిన ఈ వ్యాఖ్యలు గల వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని నలుగురు సభ్యులు జస్టిస్ ఎస్. ఖన్నన్, జస్టిస్ ఎస్.ఆర్.గవాయి, జస్టిస్ ఎస్. కాంత్‌తో కూడిన ధర్మాసనం స్పందించింది.
Also Read: CM Mamata Banerjee: పశ్చిమ బెంగాల్‌కు వరద పోటు.. జార్ఖండ్ సరిహద్దు మూసివేత
Also Read: Justice PC Ghose : నేటి నుంచి మళ్లీ కాళేశ్వరంపై విచారణ.. హాజరుకానున్న కీలక అధికారులు
న్యాయస్థానంలోని ప్రోసిడింగ్స్ సోషల్ మీడియాలో సైతం వైరల్‌గా మారుతున్నాయని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, వ్యాఖ్యలు న్యాయానికి కట్టుబడి ఉండే విధంగా ఉండాలని సదరు ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నివేదిక సమర్పించాలని కర్ణాటక హైకోర్టును కోరామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ స్పష్టం చేశారు. అయితే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేదవేసాచార్ శ్రీశానంద చేసిన కామెంట్లు గల రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Dhruvi Patel: మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2024 విజేత.. ధృవీ పటేల్
For More National News And Telugu News...