Train Accident: రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులు.. వారి లక్ష్యం అదే..!
ABN, Publish Date - Oct 12 , 2024 | 12:08 PM
ముచ్చటగా మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం దేశవ్యాప్తంగా పలు దుర్ఘటనలు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. వాటిలో రైలు ప్రమాదాలు ఒకటి. ఒడిశాలోని బాల్‌సోర్‌లో భారీ రైలు ప్రమాదం జరిగింది. అనంతరం పలు రైలు ప్రమాద ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి.
ముచ్చటగా మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం దేశవ్యాప్తంగా పలు దుర్ఘటనలు భారీ ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. వాటిలో రైలు ప్రమాదాలు ఒకటి. ఒడిశాలోని బాల్‌సోర్‌లో భారీ రైలు ప్రమాదం జరిగింది. అనంతరం పలు రైలు ప్రమాద ఘటనలు వరుసగా చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా బెంగళూర్ - దర్భంగా రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బాల్ సోర్ రైలు ప్రమాదానికి.. తాజాగా జరిగిన బెంగళూర్ - దర్బంగా రైలు ప్రమాదానికి దగ్గర పోలికలు ఉన్నాయి.
Also Read: మౌనం వీడండి.. హిందువులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఉగ్రవాదుల హస్తం ఉందా?.. సీఆర్ఎస్‌తోపాటు ఎన్ఐఏతో దర్యాప్తు
ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉండి ఉండే అవకాశముందని భారతీయ రైల్వే అనుమానిస్తుంది. ఆ క్రమంలో ఆ డివిజన్‌లోని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ (సీఆర్ఎస్)తో అంతర్గత విచారణకు భారతీయ రైల్వే ఆదేశించింది. అలాగే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)తో దర్యాపు చేయించేందుకు సద్ధమైంది. కేవలం రైల్వే ఉద్యోగి వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేకుంటే సిగ్నల్ హ్యాక్ చేయడం ద్వారా.. కావాలని ఈ ప్రమాదం చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు భారతీయ రైల్వే వివరణ ఇచ్చింది.
Also Read: పెద్దమ్మ తల్లి దేవాలయానికి పోటెత్తిన భక్తులు: నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు
ఒడిశాలోని బాల్‌సోర్‌లో..
ఒడిశాలోని బాల్‌సోర్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సైతం లూప్‌లైన్‌లో ఆగి ఉన్న రైలును ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వందలాది మంది మరణించగా.. వేలాది మంది గాయపడ్డారు. అయితే బెంగళూరు - దర్బంగా మధ్య నడుస్తున్న ఈ రైలు సైతం దాదాపుగా అదే తరహాలో చోటు చేసుకుంది.
Also Read: సొంతిల్లు కావాలంటే.. ఇలా చేయండి చాలు..
ఈ నేపథ్యంలో ఈ రైలు ప్రమాదాలపై సర్వత్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదీకాక గతంలో బాల్‌సోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఉగ్రవాద మూలలున్నాయనే ఓ ప్రచారం సైతం గట్టిగానే సాగింది. అప్పుడే ఈ తరహా దర్యాప్తు జరిగి ఉంటే నేడు మరో రైలు ప్రమాదానికి ఆస్కారం ఉండేది కాదనే అభిప్రాయం సైతం సర్వత్రా వ్యక్తమవుతుంది.
Also Read: గాల్లోకి ఎగిరిన బోగీలు
రైల్వే ట్రాక్‌లపై...
మరోవైపు ఇటీవల రైలు ట్రాక్‌లపై సిమెంట్ దిమ్మలు, గ్యాస్ సిలండర్‌లు, ఇనుప రాడ్లను ఉంచి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. అలాంటి వేళ లోకో పైలట్లు వెంటనే అప్రమత్తమై... అత్యవసర బ్రేకులను ఉపయోగించి రైళ్లను నిలిపివేస్తున్నారు. అయితే బెంగళూరు - దర్బంగా ఎక్స్ ప్రెస్ రైలు దుర్ఘటన సైతం లోకో పైలెట్ అప్రమత్తతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా కాపాడగలిగింది. ఎక్స్‌ప్రెస్ రైలు లూప్‌లైన్‌లోకి వచ్చిన విషయాన్ని లోకో పైలెట్ వెంటనే గ్రహించాడు. ఆ క్రమంలో అత్యవసర బ్రేకులు వేసే సరికి బోగీలు పట్టాలు అయితే తప్పాయి కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగకపోవడం విశేషం.
Also Read: మీరే నాకు ఆదర్శం..భువనేశ్వరి భావోద్వేగం
ప్రమాదానికి గల కారణాలు త్వరలో బహిర్గతం..
ఇంకోవైపు గతంలో ఉగ్రవాదులు పలు దుశ్చర్యలకు పాల్పడే వారు.. కానీ నేడు వారు సైతం రూట్ మార్చి.. ఈ తరహా చర్యలు పాల్పడుతున్నారనే ఓ చర్చ అయితే సాగుతుంది. ఏదీ ఏమైనప్పటికీ ఈ ప్రమాదాలకు గల కారణాలను భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన కమిటీతోపాటు ఎన్ఐఏ సైతం విచారణ జరిపి మరికొద్ది రోజుల్లో బహిర్గతం చేయనుంది.
For National News And Telugu News..
Updated Date - Oct 12 , 2024 | 12:09 PM