ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi: ఎర్రన్న వారసుడిగా!

ABN, Publish Date - Jun 10 , 2024 | 04:55 AM

కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్‌నాయుడు (37) టీడీపీ సీనియర్‌ నేతల్లో అగ్రగణ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమారుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయ న.. అతిచిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు.

  • తండ్రి అడుగుజాడల్లోనే

  • రామ్మోహన్‌నాయుడు

  • శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్‌

  • 36 ఏళ్లకే.. మోదీ క్యాబినెట్‌లో

  • శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్‌ విజయం

న్యూఢిల్లీ/శ్రీకాకుళం/గుంటూరు/భీమవరం, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్‌నాయుడు (37) టీడీపీ సీనియర్‌ నేతల్లో అగ్రగణ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమారుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయ న.. అతిచిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. 2013లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గమంతా సైకిల్‌ ర్యాలీ నిర్వహించి తనకంటూ గుర్తింపు సాధించారు. ప్రజాసమస్యలపై స్పందించి పట్టుపెంచుకున్నారు. పార్టీలో అనతికాలంలోనే కీలక నాయకుడిగా ఎదిగారు. పార్టీ అధినేత చంద్రబాబుకు స న్నిహితుడయ్యారు. 2013 అక్టోబరులో ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశంపై ఆయనకు మద్దతుగా ఢిల్లీలో నిరాహార దీక్ష కూడా చేశారు. 2014లో తొలిసారి శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. అక్కడ వరుసగా మూడు సార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టారు.


ఈసారి 3.27 లక్షల భారీ మెజారిటీతో గెలవడం విశేషం. 1987 డిసెంబరు 18న జన్మించిన ఈయన మోదీ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడు (ఈయనతో పాటు కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రక్ష నిఖిల్‌ ఖడ్సే 1987 మే 13న పుట్టారు). రామ్మోహన్‌కు భార్య శ్రావ్య, కుమార్తె ఉన్నారు. ఆయన యూఎ్‌సఏలో పుర్డ్యూ యూనివర్సిటీలో బీ-టెక్‌ పూర్తిచేశారు. న్యూయార్క్‌లో ఐలాండ్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదివారు. ఆంగ్లం, హిందీల్లో అనర్గళంగా ప్రసంగించగలరు. తండ్రిలాగే తాను కూడా కేంద్ర మంత్రి అయ్యారు. కాగా.. ఆయన బాబాయి అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నుంచి గెలిచారు. సోదరి, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక రామ్మోహన్‌ భార్య తండ్రి మాజీ మంత్రి బండారు సంత్యనారాయణమూర్తి కూడా అనకాపల్లి జిల్లా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


ఈ దఫా ఎక్కువ మంది వస్తామని..

గత ఏడాది లోక్‌సభలో రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు ప్రస్తావించేందుకు కొన్ని నిమిషాల సమయం కావాలని స్పీకర్‌ను కోరారు. అయితే చాలా తక్కువ సమయం ఇవ్వడంతో.. వచ్చే దఫా టీడీపీ నుంచి అధిక ఎంపీలు బంపర్‌ మెజారిటీతో వస్తారని.. అప్పుడు అడిగినంత సమయం ఇస్తారని ఆయన స్పీకర్‌తో అన్నారు. తాజా లోక్‌సభలో ఎన్డీయేలో బీజేపీ (240) తర్వాత అతిపెద్ద పార్టీ (16) టీడీపీయేనన్న సంగతి తెలిసిందే.


ఇది రాష్ట్ర ప్రజల విజయం: రామ్మోహన్‌

తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం ఆంధ్ర ప్ర జల విజయమని రామ్మోహన్‌నాయుడు అన్నారు. ప్రమాణస్వీకారానికి ముందు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రిగా అవకాశం రావడం సంతోషంగా ఉందని, రాష్ట్రానికి మరింత సేవచేసే అవకాశం దక్కిందన్నారు. తన ఉన్నతికి శ్రీకాకుళం ప్రజలే కారణమన్నారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాభివృద్థికి, రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.


అత్యంత పిన్నవయస్కుడు..

మోదీ క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న వారిలో అత్యంత పిన్నవయస్కుడిగా టీడీపీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు (36) నిలిచారు. వరుసగా మూడోసారి ఎంపీగా ఎన్నికైన రామ్మోహన్‌ నాయుడు కేంద్ర మంత్రిగా ప్రమాణం చేశారు. రామ్మోహన్‌ నాయుడు తర్వాత మోదీ క్యాబినెట్‌లో అత్యంత పిన్నవయస్కురాలిగా మహారాష్ట్ర, బీజేపీ నేత రక్ష నిఖిల్‌ ఖడ్సే(37) నిలిచారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 05:05 AM

Advertising
Advertising