Terror Attack: యాత్రికులపై ఉగ్రదాడి, 10 మంది మృతి.. స్పందించిన మోదీ, రాష్ట్రపతి, రాహుల్
ABN, Publish Date - Jun 10 , 2024 | 07:13 AM
ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి(Terror attack) జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్(jammu kashmir)లోని రియాసి జిల్లా(Reasi district)లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ప్రధాని మోదీతోపాటు రాష్ట్రపతి, అమిత్ షా, రాహుల్ గాంధీ స్పందించారు.
ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి(Terror attack) జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30 మందికిపైగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్(jammu kashmir)లోని రియాసి జిల్లా(Reasi district)లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శివఖోడి ఆలయాన్ని సందర్శించేందుకు యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బస్సు అదుపు తప్పి లోతైన గుంతలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందారు. గాయపడిన వారు నోయిడా-ఘజియాబాద్, ఇతర జిల్లాలకు చెందినవారని తెలుస్తోంది.
ఈ దాడి గురించి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి సమాచారం తెలుసుకున్న ప్రధాని మోదీ(narendra Modi) ఉగ్రదాడిని ఖండించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, వారి కుటుంబాలకు సాధ్యమైన అన్ని సహాయాలు అందేలా చూడాలని ప్రధాని ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా ట్వీట్ చేశారు. దీంతోపాటు ఉగ్రవాదుల గాలింపు కోసం భద్రతా బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ ప్రారంభించాయని, దాడి వెనుక ఉన్న వారిని విడిచిపెట్టబోమని ఎల్‌జీ సిన్హా స్పష్టం చేశారు. ఈ దుర్మార్గపు చర్య వెనుక ఎవరు ఉన్నా కూడా వారికి త్వరలోనే శిక్ష పడుతుందన్నారు.
అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ దాడి పట్ల కేంద్ర మంత్రి అమిత్ షా(Amit Shah) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్, డీజీపీతో మాట్లాడి ఘటనపై సమాచారం తెలుసుకున్నానని, ఈ పిరికిపంద దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టేదిలేదన్నారు. బాధితులకు న్యాయం చేస్తామన్నారు. వెంటనే వైద్యసేవలు అందించేందుకు స్థానిక యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కృషి చేస్తుందని చెప్పారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఈ అంశంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ(rahul gandhi) కూడా ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆందోళనకరంగా ఉన్న భద్రతా పరిస్థితికి ఈ సిగ్గుచేటు ఘటన నిజమైన చిత్రమని అన్నారు. ఇది కాకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించి మా ప్రజలపై జరిగిన ఈ భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నామని అన్నారు. దేశ భద్రత పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడాన్ని మేము నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి:
VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్ బైబై
Read More National News and Latest Telugu News
Updated Date - Jun 10 , 2024 | 07:20 AM