Kerala: మదర్సా టీచర్ హత్య కేసు.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు..
ABN, Publish Date - Mar 30 , 2024 | 08:03 PM
కేరళలో పెను సంచలనం రేకెత్తించిన మదర్సా టీచర్ రియాజ్ మౌలవీ హత్యకేసులో ముగ్గురు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ మేరకు కాసరగోడ్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది.
కేరళలో పెను సంచలనం రేకెత్తించిన మదర్సా టీచర్ రియాజ్ మౌలవీ హత్యకేసులో ముగ్గురు నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. ఈ మేరకు కాసరగోడ్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది. అజేష్, నితిన్ కుమార్, అఖిలేష్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కాగా వీరందరూ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలే కావడం గమనార్హం. 2017 మార్చి 20న కాసర్‌గోడ్‌లో మదర్సా ఉపాధ్యాయుడు రియాజ్ మౌలవి హత్యకు గురయ్యాడు. మదర్సా సమీపంలోని తన నివాసంలో మౌలవీని నరికి చంపారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కల్లోలం రేపింది. మతకల్లోలాలు సృష్టించడమే నిందితుల ఉద్దేశమని చార్జిషీట్ లో నమోదైంది. కన్నూర్ క్రైమ్ బ్రాంచ్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని అప్పటి కోస్టల్ సీఐ పీకే సుధాకరన్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం నిందితులను అరెస్ట్ ( Arrest ) చేసింది.
Viral Video: అందుకే చెప్పేది.. కూల్ డ్రింక్స్ తాగొద్దని.. ఎందుకో ఈ వీడియో చూసేయండి..
2019 లో ఈ కేసులో విచారణ ప్రారంభమైంది. దీంతో ఏడేళ్లుగా నిందితులు బెయిల్ పొందకుండా జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. డీఎన్‌ఏ పరీక్ష ఫలితాలతో పాటు 50కి పైగా పత్రాలు, 215 డాక్యుమెంట్లు, 45 డాక్యుమెంట్లను పోలీసులు కోర్టులో సమర్పించారు. ఈ కేసులో తీర్పును ఇప్పుటికే మూడుసార్లు మార్చారు. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి 29 న తీర్పు వెలువరించాల్సి ఉండగా మార్చి 7కు ఆ తర్వాత మార్చి 20కు, చివరగా నేడు తీర్పు విడుదలైంది.
MS Dhoni: డూడుల్ పై ధోనీ రైడ్.. వీధుల్లో రయ్ రయ్.. వీడియో వైరల్..
రియాజ్ మౌలవీ హత్య కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కోర్టు ఆవరణలో భారీ రద్దీ నెలకొంది. అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తున్నట్లు వన్‌లైన్ స్టేట్‌మెంట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తీర్పు నేపథ్యంలో జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 30 , 2024 | 08:07 PM