ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Politics: పార్టీలు ఫిరాయించడంలో ఘనాపాటీలు.. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు..

ABN, Publish Date - Oct 04 , 2024 | 08:21 PM

కొందరు నాయకులైతే ప్రాణం పోయే వరకు ఒకే పార్టీని నమ్ముకుని ఉండేవాళ్లు. ఇదంతా గతం.. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. పదవుల కోసం పార్టీలు ఫిరాయించడం కామన్ అయిపోయింది. ఉదయం ఏ పార్టీలో ఉంటారో.. మధ్యాహ్నం ఏ పార్టీలో ఉంటారో చెప్పడమే కష్టంగా మారింది. ఎన్నికల సమయంలో ..

Haryana Politics

ఇటీవల కాలంలో రాజకీయాల్లో ఫిరాయింపులు సర్వ సాధారణం అయిపోయాయి. గతంలో సిద్ధాంతాల ఆధారంగా వ్యక్తులు తమ రాజకీయ పార్టీలను ఎంచుకునేవారు. అత్యవసర సమయాల్లోనూ, తీవ్ర అవమానాలు ఎదుర్కొన్న సమయాల్లో మాత్రమే పార్టీలు మారేవారు. కొందరు నాయకులైతే ప్రాణం పోయే వరకు ఒకే పార్టీని నమ్ముకుని ఉండేవాళ్లు. ఇదంతా గతం.. ప్రస్తుతం ట్రెండ్ మారిపోయింది. పదవుల కోసం పార్టీలు ఫిరాయించడం కామన్ అయిపోయింది. ఉదయం ఏ పార్టీలో ఉంటారో.. మధ్యాహ్నం ఏ పార్టీలో ఉంటారో చెప్పడమే కష్టంగా మారింది. ఎన్నికల సమయంలో అయితే ఈ ఫిరాయింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకో పార్టీ కండువా కప్పుకునే నాయకులను ఇటీవల తెలంగాణ ఎన్నికల సమయంలో చూశాం. దేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఉదయం వరకు ఓ పార్టీకి ఓటు వేయమని అడిగిన నాయకులు సాయంత్రానికి మరో పార్టీ తరపున ప్రచారం చేసే సన్నివేశాలు ఎన్నికల వేళ కనిపిస్తాయి. తాజాగా హర్యానాలో మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనున్న వేళ బీజేపీ నాయకుడు అశోక్ తన్వర్ పార్టీ కండువా మార్చడంతో ఫిరాయింపుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత ఐదేళ్లలో నాలుగు పార్టీలు మారిన ఘనతను అశోక్ తన్వర్ దక్కించుకున్నారు. హర్యానా రాజకీయాల్లో ఎక్కువ పార్టీలు మారిన వ్యక్తి తన్వర్ మాత్రమే కాదు. ఆయనకంటే ముందు మరో ముగ్గురు నాయకులు ఈ ఘనతను సాధించారు.

AP Capital: ఏపీ రాజధానికి రైల్వే ట్రాక్‌పై ఏపీ ఎంపీల కీలక ప్రకటన


పోలింగ్‌కు కొన్ని గంటల ముందు..

హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కొన్ని గంటల ముందు మాజీ ఎంపీ అశోక్ తన్వర్ రాహుల్ గాంధీతో వేదిక పంచుకోవడంతో టర్న్‌ కోట్ అంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీంతో ఫిరాయింపుల అంశం తెరపైకి వచ్చింది. అశోక్ తన్వర్ గత ఐదు సంవత్సరాలలో నాలుగు సార్లు పార్టీ మారారు. హర్యానా రాజకీయాల్లో తన్వర్ కంటే ముందే ముగ్గురు నేతలు ఫిరాయింపుల్లో రికార్డు నెలకొల్పారు. వీరిలో ఒకరు ఏకంగా ఏడు సార్లు పార్టీ మారారు. 2019లో కాంగ్రెస్‌ను వీడిన అశోక్ తన్వర్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని రోజులకు సొంత పార్టీని స్థాపించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు తన్వర్ బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి సిర్సా ఎంపీగా పోటీచేసి ఘోర పరాజయాన్ని చవిచూశారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు కాంగ్రెస్‌లో చేరారు.

AP Highcourt: హైకోర్టులో సజ్జలకు ఊరట.. ఏ కేసులో అంటే


హీరానంద్ ఆర్య

దేవీలాల్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన హీరానంద్ ఆర్య తన రాజకీయ జీవితంలో ఏడు సార్లు పార్టీ ఫిరాయించారు. కాంగ్రెస్ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన హీరానంద్ 1967లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరపున లోహారు స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1977లో జనతా పార్టీ నుంచి, 1982, 1987 ఎన్నికల్లో లోక్‌దళ్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. హర్యానా రాజకీయ సంక్షోభంలో ఆయన ఐదు పార్టీలను మారారు. చౌదరి దేవిలాల్‌కు సన్నిహితంగా ఉండటంతో ఆయనకు విద్యాశాఖ మంత్రి పదవిని ఇచ్చారు. హీరానంద్ తర్వాత ఆయన రాజకీయ వారసత్వం భార్య చంద్రావతి, కుమారుడు సోమ్‌వీర్‌కు వెళ్లింది. వారిద్దరూ లోహరు స్థానం నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు.

Pawan Kalyan vs Udhayanidhi Stalin: ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్


గయాలాల్

1967లో హసన్‌పూర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన చౌదరి గయాలాల్, ఒకే రోజులో మూడుసార్లు పార్టీలు మారారు. 1967లో భగవత్ దయాళ్ శర్మ కారణంగా హసన్‌పూర్ టికెట్ రాకపోవడంతో గయాలాల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. స్థానిక రాజకీయ సమీకరణల కారణంగా గయాలాల్ విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు సొంతంగా మెజార్టీ రాకపోవడంతో ఆ పార్టీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల మద్దతు కోరింది. దీంతో దేవిలాల్‌కు గయాలాల్ మద్దతు పలికారు. గయాలాల్ ఫిరాయింపుల కారణంగా ఆయారామ్.. గయా రామ్ పదం పాపులర్ అయింది. ప్రస్తుతం గయాలాల్ కుమారుడు ఉదయ్‌భాన్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు.


కర్తార్ సింగ్ భదానా

హర్యానా మాజీ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ భదానా ఆరుసార్లు పార్టీ మారారు. కర్తార్ తొలిసారిగా 1996లో బన్సీ లాల్ హర్యానా వికాస్ పార్టీ గుర్తుపై సమల్ఖా స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1998లో కర్తార్ తిరుగుబాటు చేసి 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఐఎన్‌ఎల్‌డికి మద్దతు ఇచ్చారు. 2000లో కర్తార్ సింగ్ భదానా ఐఎన్‌ఎల్‌డి టికెట్‌పై పోటీచేసి ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఓం ప్రకాష్ చౌతాలా ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2004 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్తార్ బీజేపీలో చేరారు. రాజస్థాన్‌లోని దౌసా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ ఆయనను పోటీకి దింపింది, అయితే కర్తార్ విజయం సాధించలేదు. 2005 హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో కర్తార్ సోహ్నా స్థానం నుండి బిజెపి తరపున పోటీచేసి ఓడిపోయారు. 2009లో కర్తార్ యుపిలోని బిజ్నోర్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్‌సిపి గుర్తుపై పోటీచేసి ఓడిపోయారు. 2012లో ఖతౌలీ నుంచి ఆర్‌ఎల్‌డీ టికెట్‌పై పోటీ చేసి గెలిచి యూపీ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్తార్ బీఎస్పీలో చేరారు. ఆయన తిరిగి 2024లో బీజేపీలో చేరారు.


Tirumala issue: తిరుమల లడ్డూ వివాదం- సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రుల రియాక్షన్ ఇదే..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

To Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 04 , 2024 | 08:23 PM