ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Navneeth Kaur: నా పుట్టుక గురించి ప్రశ్నించిన వారికి ఇదే సమాధానం.. ఎంపీ నవనీత్..

ABN, Publish Date - Apr 05 , 2024 | 08:46 AM

తప్పుడు కుల ధ్రువీకరణ కేసులో ప్రముఖ నటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు ఊరట లభించింది. ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లుబాటు అయ్యేలా స్క్రూటినీ కమిటీ ఉత్తర్వులను భారత అత్యున్నత న్యాయస్థానం ( Supreme Court ) సమ

తప్పుడు కుల ధ్రువీకరణ కేసులో ప్రముఖ నటి, మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు ఊరట లభించింది. ఆమె కుల ధృవీకరణ పత్రం చెల్లుబాటు అయ్యేలా స్క్రూటినీ కమిటీ ఉత్తర్వులను భారత అత్యున్నత న్యాయస్థానం ( Supreme Court ) సమర్థించింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను రద్దు చేయాలని న్యాయమూర్తులు జేకే.మహేశ్వరి, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. తన కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును నవనీత్ కౌర్ సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై 2024 ఫిబ్రవరి 29న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

రాజ్యసభ సభ్యురాలిగా సోనియా ప్రమాణం

శివసేన మాజీ ఎంపీ ఆనంద విఠోబా అద్సుల్ బాంబే నవనీత్ కౌర్ కుల ధ్రువీకరణపై హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు నవనీత్ కౌర్ రాణా కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేసింది. ఆమె మోసపూరితంగా డాక్యుమెంట్ ను పొందారని తెలిపింది. ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రూ. 2 లక్షలు జరిమానా విధించింది. నవనీత్ కౌర్ "మోచి" (షెడ్యూల్‌ కులం)కి చెందిన వ్యక్తిగా తప్పుడు సర్టిఫికేట్‌ పొంది 2019 ఎన్నికల్లో రిజర్వ్‌డ్‌ కేటగిరీ సీటులో పోటీ చేశారని హైకోర్టు పేర్కొంది.


కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తొలగించలేం

హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అవాక్కైన ఎంపీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ పై పిచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. స్క్రూటినీ కమిటీ ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఈ తీర్పుపై స్పందించిన నవనీత్ కౌర్ ఎల్లప్పుడూ న్యాయమే గెలుస్తుందని అన్నారు. తన పుట్టుక గురించి ప్రశ్నలు వేసిన వారికి ఈ రోజు సమాధానం వచ్చిందని చెప్పారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 05 , 2024 | 08:50 AM

Advertising
Advertising