ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Chandigarh: ఆ ఓట్లనూ లెక్కలోకి తీసుకోండి.. సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..

ABN, Publish Date - Feb 20 , 2024 | 04:54 PM

చండీగఢ్ మేయర్ ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎనిమిది చెల్లిన ఓట్లు ఉన్నాయని, కాబట్టి మళ్లీ లెక్కించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

చండీగఢ్ మేయర్ ఎన్నికలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎనిమిది చెల్లిన ఓట్లు ఉన్నాయని, కాబట్టి మళ్లీ లెక్కించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఓట్ ట్యాంపరింగ్ ఆరోపణలపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది జనవరి 30న చండీగఢ్ మేయర్ ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్‌లో 35 మంది కౌన్సిలర్లు ఉండగా అందులో ఆప్-కాంగ్రెస్ కూటమికి 20, బీజేపీకి 14, ఎస్ఏడీకి ఒక కౌన్సిలర్ ఉన్నారు. మేయర్ ఓటింగ్ సందర్భంగా ఆప్-కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది కౌన్సిలర్ల ఓట్లను చెల్లనివిగా ఆర్వో అనిల్ మాసిహ్ ప్రకటించారు. బీజేపీ మేయర్ అభ్యర్థి మనోజ్ సోంకర్‌ను విజేతగా ప్రకటించారు.

బ్యాలెట్ పేపర్లపై రిటర్నింగ్ అధికారి అనిల్ మాసిహ్ ఎక్స్ మార్క్‌ పెడుతున్నట్లు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. ఈ వీడియో బయటకు రావడంతో రాజకీయంగా తీవ్ర కలకలం రేగింది. దీంతో ఆప్ కౌన్సిలర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై మంగళవారం మరోసారి విచారణ జరిపిన ధర్మాసనం అనిల్ మాసిహ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే బ్యాలెట్ పేపర్లను కొట్టివేశారని మండిపడింది. ఈ క్రమంలో ఆ 8 ఓట్లను కూడా లెక్కలోకి తీసుకుని మరోసారి మొత్తం ఓట్ల లెక్కింపు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 20 , 2024 | 05:40 PM

Advertising
Advertising