ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Supreme Court: ఆమె సహకారం తక్కువేమీ కాదు.. హౌస్‌వైఫ్‌ల విషయంలో కీలక తీర్పు..

ABN, Publish Date - Feb 17 , 2024 | 12:15 PM

ఆఫీసు లేదా పనికి వెళ్లి జీతం తీసుకునే వారి కంటే ఇంట్లో మహిళ చేసే పని విలువ తక్కువేమీ కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గృహిణి ( హౌస్ వైఫ్ ) సహకారం అమూల్యమైనదని పేర్కొంది.

ఆఫీసు లేదా పనికి వెళ్లి జీతం తీసుకునే వారి కంటే ఇంట్లో మహిళ చేసే పని విలువ తక్కువేమీ కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. గృహిణి ( హౌస్ వైఫ్ ) సహకారం అమూల్యమైనదని పేర్కొంది. ఇంటి కోసం ఆమె చేసే సేవను డబ్బు రూపంలో లెక్కించడం కష్టతరమని అభిప్రాయపడింది. అయితే.. మోటారు ప్రమాద క్లెయిమ్‌ల విషయంలో వారి పని, శ్రమ, సేవ ఆధారంగా వృత్తిగత ఆదాయాన్ని లెక్కించాలని ట్రిబ్యునళ్లు, కోర్టులకు సూచించింది. 2006లో ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ఘటనపై మోటారు ప్రమాద కేసు నమోదైంది. దీనిపై విచారణ జరుపుతున్న జస్టిస్ సూర్యన్ కాంత్, జస్టిస్ కే.వీ.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెల్లడించింది.

“ఆదాయం ఉన్న కుటుంబ సభ్యుని పాత్ర ఎంత ముఖ్యమైనదో గృహిణి పాత్ర కూడా అంతే ముఖ్యమైనది. గృహిణి చేసే కార్యకలాపాలను ఒక్కొక్కటిగా లెక్కిస్తే ఆ సహకారం, సేవలకు వెల కట్టలేం" అని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా 2006లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్‌కు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు ప్రయాణిస్తున్న వాహనానికి బీమా లేకపోవడంతో ఆమె కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వాహనం యజమానిపై పడింది. ఈ క్రమంలో ₹ 2.5 లక్షలు నష్టపరిహారం ఇచ్చింది. అధిక పరిహారం కోరుతూ బాధిత కుటుంబం ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించింది.


ఈ పిల్ ను విచారించిన హైకోర్టు మృత చెందిన మహిళ కనీస జీవితకాలాన్ని పరిగణలోకి తీసుకుని పరిహారాన్ని నిర్ణయించాలని తన ఆర్డర్‌లో పేర్కొంది. అయితే రోజువారీ కూలీ కంటే తక్కువగా పరిగణిస్తూ ట్రిబ్యునల్ ఉత్తర్వుల్లో ఎటువంటి లోపాలు లేవని హైకోర్టు గుర్తించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు ఖండించింది. కాలం చెల్లిన విధానాన్ని అవలంబిస్తున్నారని హైకోర్టును నిందించింది. గృహిణి ఆదాయాన్ని రోజువారీ కూలీ కంటే తక్కువగా ఎలా పరిగణిస్తారని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మృతురాలికి మైనర్ కుమారుడు ఉన్నందున పరిహారాన్ని రూ. 6 లక్షలకు పెంచాలని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 12:15 PM

Advertising
Advertising