ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Karnataka: పాకిస్థాన్ జిందాబాద్ అని నినదించిన ముగ్గురి అరెస్ట్.. ఎలా నిర్ధారించారు..?

ABN, Publish Date - Mar 05 , 2024 | 01:53 PM

కర్ణాటక విధాన సౌధ పాకిస్థాన్ జిందాబాద్ అని నినదించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూర్‌కు చెందిన మునావర్‌, హవేరికి చెందిన మహ్మద్ షఫీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని బెంగళూరు కోర్టులో ప్రవేశపెట్టగా మూడు రోజుల పోలీసుల కస్టడీకి ఇచ్చారు.

బెంగళూర్: కర్ణాటక (Karnataka) విధాన సౌధ ( Vidhana Soudha) పాకిస్థాన్ జిందాబాద్ (Pakistan Zindabad) అని నినదించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూర్‌కు చెందిన మునావర్‌, హవేరికి చెందిన మహ్మద్ షఫీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని బెంగళూరు కోర్టులో ప్రవేశపెట్టగా మూడు రోజుల పోలీసుల కస్టడీకి ఇచ్చారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడిగా సయ్యద్ నజీర్ హుస్సేన్ విజయం సాధించారు. దాంతో అసెంబ్లీ ఎదుట సెలబ్రేషన్స్ నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ.. జై కాంగ్రెస్ అని నినాదాలు చేశారు. అంతలో కొందరు పాకిస్థాన్ జిందాబాద్ అని నినదించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఘటనపై విధాన సౌధ పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి వీడియో ఫుటేజీ తీశారు. దానిని ఫోరెన్సిక్ బృందానికి పంపించారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఆధారాలను పోలీసులు సేకరించారు. తర్వాత ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. వీడియో ఆధారంగా ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. ఇల్తాజ్, మునావర్, మహ్మద్ షఫీ పాకిస్థాన్ జిందాబాద్ అన్నారని నిర్ధారించారు.

ఇది కూడా చదవండి: Chief Minister: నేను కమీషన్‌ తీసుకున్నట్లు నిరూపిస్తారా.. రాజకీయాలకు గుడ్‌బై చెబుతా..

‘పాకిస్థాన్ జిందాబాద్ అని ముగ్గురు రెండుసార్లు నినదించారు. స్లోగన్స్ ఇచ్చిన వారు పేర్లను ఫోరెన్సిక్ బృందం పేర్కొనలేదు. ఫోరెన్సిక్ బృందానికి ఇచ్చిన వీడియో ప్రామాణికమైంది. ఫోరెన్సిక్ నిపుణుల నివేదిక ప్రకారం ఆ ముగ్గురు నినదించారు. నివేదిక ఆధారంగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు అని’ కర్ణాటక హోం మంత్రి డాక్టర్ జి పరమేశ్వర (Parameshwara) వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 05 , 2024 | 02:05 PM

Advertising
Advertising