ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Video Viral: అధీర్ రంజన్ వీరంగంపై టీఎంసీ సంచలన వీడియో

ABN, Publish Date - Apr 13 , 2024 | 06:05 PM

కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి బహరాంపూర్‌లో నడిరోడ్డుపై తమ కార్యకర్తను నిలదీస్తూ వీరంగ సృష్టించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అధీర్ రంజన్ దౌర్జన్యాన్ని ఎండగడుతూ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.

బహరాంపూర్: కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir Ranjan Chowdhury) బహరాంపూర్‌లో నడిరోడ్డుపై తమ కార్యకర్తను నిలదీస్తూ వీరంగ సృష్టించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) తప్పుపట్టింది. అధీర్ రంజన్ దౌర్జన్యా్న్ని ఎండగడుతూ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. ''ఎన్నికల్లో ఓటమి భయం వల్లే మీరు ఇలాంటి చర్యలకు దిగుతున్నారు. కండ బలం చూపించి మా కార్యకర్తలను బెదిరించడం వల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు. మీ చర్య సిగ్గుచేటు'' అని టీఎంసీ ఆ పోస్ట్‌లో ఆక్షేపణ తెలిపింది.

Video: సీఎం కోసం స్వీట్ షాప్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ..తర్వాత ఏమైందంటే


'ఇండియా' (I.N.D.I.A.) కూటమిలో కాంగ్రెస్‌తో టీఎంసీ భాగస్వామ్య పార్టీగా ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో ఆ పార్టీతో ఎలాంటి పొత్తూ లేకుండా ఒంటరిగా పోటీ చేస్తోంది. బెంగాల్‌లో పొత్తు బెడిసికొట్టడానికి అధీర్ రంజన్ కారణమని టీఎంసీ బాహాటంగానే ప్రకటించింది. మొత్తం ఏడు దశల్లో బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 06:08 PM

Advertising
Advertising