ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mumbai: ముంబై 26/11 ఘటనకు 16 ఏళ్లు.. ఆ రోజు ఏం జరిగిందంటే..

ABN, Publish Date - Nov 26 , 2024 | 09:06 AM

26 నవంబర్, 2008న ఉదయం ముంబై ప్రజలు ఎప్పటిలాగానే తమ రోజును ప్రారంభించారు. అయితే ఆ రోజు రాత్రి ఉగ్రవాదులు పెను బీభత్సం సృష్టిస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 26, 2008 (26/11).. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారత్‌లో మారణకాండ సృష్టించిన రోజు. నాటి దమనకాండకు నేటితో సరిగ్గా 16 ఏళ్లు నిండాయి. 26/11 ఘటనను దేశపౌరులు ఎప్పటికీ మరిచిపోలేరు. ఆ రోజు ఉగ్రవాదులు చేసిన దారుణం అంతా ఇంతా కాదు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి ఏకంగా 166మందిని పొట్టన బెట్టుకున్నారు. వారి దెబ్బకు ముంబై నగరం విలవిల్లాడిపోయింది.


అక్రమంగా ప్రవేశించి..

26 నవంబర్, 2008న ఉదయం ముంబై ప్రజలు ఎప్పటిలాగానే తమ రోజును ప్రారంభించారు. అయితే ఆ రోజు రాత్రి ఉగ్రవాదులు పెను బీభత్సం సృష్టిస్తారని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఆ రోజు సాయంత్రం ఓ భారతీయ పడవను హైజాక్ చేసిన 10మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు.. పడవలోని వారిని దారుణంగా చంపేశారు. అనంతరం ముంబై తీరంలోని కొలాబా సముద్ర మార్గం ద్వారా దేశంలోని అక్రమంగా ప్రవేశించారు. బృందాలుగా విడిపోయిన వారంతా దేశ ఆర్ధిక రాజధానిలోని వివిధ ప్రాంతాలకు చేరుకున్నారు. అనంతరం స్టార్ హోటళ్లు, హాస్పిటల్, రైల్వేస్టేషన్ లక్ష్యంగా ఏకకాలంలో దాడులకు తెగబడ్డారు.


మారణహోమం..

బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు ముందుగా ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినల్‌లో రద్దీగా ఉన్న రైల్వేస్టేషన్‌‌కు చేరుకున్నారు. స్టేషన్ లోపలికి వెళ్లిన ముష్కరులు వెంట తెచ్చుకున్న ఏకే-47 తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. దేశ ప్రజలపై బుల్లెట్ల వర్షం కురిపించారు. కళ్లు మూసి తెరిచే లోపే ప్రజలు పిట్టలా రాలిపోయారు. తుపాకుల మోతతో పలువురు పరుగులు పెట్టారు. ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. రైల్వేస్టేషన్‌లో జరిగిన దాడిలో 58 మంది సాధారణ పౌరుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీంతో ఒక్కసారిగా ముంబై నగరం ఉలిక్కిపడింది. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ముష్కరులు నగర వీధుల్లో రెచ్చిపోయారు. కనిపించిన వారినల్లా కాల్చివేశారు. అనంతరం తాజ్‌ హోటల్, లియోపోల్డ్‌ కేఫ్‌, కామా హాస్పిటల్‌, ఒబెరాయ్‌ ట్రైడెంట్‌, నారిమన్‌ లైట్‌ హౌస్‌ ప్రాంతాల్లో మారణహోమం సృష్టించారు. మెుత్తం 12 చోట్ల బాంబులు, తుపాకులతో విధ్వంసానికి పాల్పడ్డారు.


రంగంలోకి భద్రతా బలగాలు..

అయితే రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు మెుదలుపెట్టాయి. ముష్కరులకు ధీటుగా సమాధానం చెప్పాయి. దాదాపు 60 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి 10మందిలో 9మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన విధ్వంసం జరిగిపోయింది. ఉగ్రవాదుల కాల్పుల్లో మెుత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉండగా.. స్వదేశీ, విదేశీ పౌరులు సైతం ఉన్నారు. అలాగే ముష్కరులతో వీరోచితంగా పోరాడుతూ మహారాష్ట్ర ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కారే అమరుడయ్యారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. పలు దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి.


కసబ్ ఉరి..

కాగా, ఘటనపై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం పట్టుపడిన ఉగ్రవాది కసబ్‌ను దోషిగా తేల్చింది. అతనికి ఉరిశిక్ష విధించింది. పట్టుపడిన నాలుగేళ్ల తర్వాత.. 2012 నవంబర్‌లో కసబ్‌ను ఎరవాడ జైలులో ఉరి తీశారు. అయితే దాడి ఘటన జరిగి నేటికి సరిగ్గా 16 ఏళ్లు నిండాయి. కాగా, నాటి దాడిలో అసువులు బాసిన ప్రజలు, భద్రతా సిబ్బంది కుటుంబాలకు దేశ ప్రజలు ఘన నివాళులు ఘటిస్తున్నారు.

Updated Date - Nov 26 , 2024 | 10:48 AM