Tungabhadra: ఊరించి.. ఉసూరుమనిపించింది..
ABN, Publish Date - Jun 21 , 2024 | 12:10 PM
గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో మే ఆఖరి, జూన్ మొదటి వారంలో కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడ్డాయి. కాని తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు వరద నీరు చేరలేదు.
- తుంగభద్రకు వరద తగ్గుముఖం
- మూడు అంకెలకు పడిపోయిన ఇన్‌ప్లో...
- గత ఏడాదికంటే 4 టీఎంసీలు తక్కువగా జలాశయంలో నీటి నిలువ
బళ్లారి(బెంగళూరు): గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అధికంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో మే ఆఖరి, జూన్ మొదటి వారంలో కర్ణాటక రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడ్డాయి. కాని తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు వరద నీరు చేరలేదు. తుంగభద్ర జలాశయం పైభాగంలోని తుంగ-భద్ర నదులపై నిర్మించిన జలాశయాలు కూడా ఇంతవరకు పూర్తి స్థాయిలో నిండలేదు. దీంతో కర్నాటక- ఆంధ్ర(Karnataka- Andhra) రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా ఉన్న తుంగభద్రకు కూడా ఇంతవరకు ఆశించిన మేర నీరు చేరక పోవడంతో ఆయకట్టు రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. సాధారణంగా జలాశయంలోకి వచ్చే నీటి వివరాలను 24గంటలకొక మారు అధికారులు నమోదు చేస్తుంటారు.
ఇదికూడా చదవండి: Vande Metro Rail: త్వరలో ‘వందే మెట్రో రైలు’ వచ్చేస్తోంది...
గురువారం ఉదయం నమోదు చేసిన వివరాల మేరకు కేవలం 759 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి వస్తుండగా, జలాశయంలో కేవలం 5.079 టీఎంసీల నీరు మాత్రమే నిలువ ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయానికి ఇన్‌ప్లో జీరో స్థాయికి పడిపోయినా 4.35 టీఎంసీల నీరు నిలువ ఉండేది. జలాశయంలో నీటి చేరిక లేని కారణంగా జలాశయం బ్యాక్‌వాటర్‌లో ఇంకా ఇసుక తిన్నెలు అలాగే కనిపిస్తున్నాయి. ముంపునకు గురైన గ్రామాల మైలురాళ్ళు కూడా కనిపిస్తుండడం విశేషం. జలాశయం నిర్మించి ఏడు దశాబ్దాలు జరిగినా జలాశయంలో గ్రామాల సరిహద్దులు తెలిపే మైలు రాళ్ళు అలాగే ఉండడం గమనార్హం.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 21 , 2024 | 12:10 PM