ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Borewell: 20 గంటల తర్వాత సురక్షితంగా బయటకు రెండేళ్ల బాలుడు

ABN, Publish Date - Apr 04 , 2024 | 03:26 PM

వ్యవసాయ అవసరాల కోసం వేసే బోరు బావుల్లో నీరు పడకుంటే పూడ్చేయాలి. లేదంటే మూసి వేయాలి. వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో పిల్లల ప్రాణాల మీదకు వస్తోన్నాయి. బోరు బావులను పూడ్చకపోవడంతో చాలా మంది చిన్నారులు అందులో పడి పోయారు. కొందరు ఆ బోరు బావి నుంచి సజీవంగా తిరిగి వస్తే, మరికొందరు ఊపిరాడక చనిపోతున్నారు. కర్ణాటకలో గల లచ్చాయన్ గ్రామంలో ఓ బాలుడు బోరుబావిలో పడిపోయాడు.

బెంగళూర్: వ్యవసాయ అవసరాల కోసం వేసే బోరు బావుల్లో (Borewell) నీరు పడకుంటే పూడ్చేయాలి. లేదంటే మూసి వేయాలి. వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడంతో పిల్లల (Childrens) ప్రాణాల మీదకు వస్తోన్నాయి. బోరు బావులను (Borewell) పూడ్చకపోవడంతో చాలా మంది చిన్నారులు అందులో పడి పోయారు. కొందరు ఆ బోరు బావి సజీవంగా తిరిగి వస్తే, మరికొందరు ఊపిరాడక చనిపోయారు. కర్ణాటకలో (Karnataka) గల లచ్చాయన్ గ్రామంలో ఓ బోరుబావిలో బాలుడు పడిపోయాడు. ఇంటి వద్ద ఆడుకునే రెండేళ్ల బాలుడు సమీపంలో ఉన్న బోరు బావిలో పడి పోయాడు.


గట్టిగా ఏడ్చిన చిన్నారి

లచ్చాయన్ గ్రామంలో బుధవారం సాయంత్రం ఆడుకుంటూ రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. బావిలో పడిన తర్వాత చిన్నారి గట్టిగా ఏడ్చాడు. దాంతో ఇరుగు పొరుగు వారు తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ బోరు బావిలో 16 ఫీట్ల లోతులో బాలుడు పడిపోయాడు. బోరుబావి పక్కన 21 ఫీట్ల వరకు మరో గుంత తవ్వారు. అలా బాలుడిని బయటకు తీసుకొచ్చారు.


చిన్నారి 20 గంటల ఆపరేషన్

బాలుడికి చికిత్స అందజేసేందుకు వైద్య బృందం బావి పక్కన ఎదురు చూసింది. ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్, ఇంజెక్షన్లు, ఆక్సిజన్‌తో పాటు అంబులెన్స్ ఏర్పాటు చేశారు. బాలుడిని బయటకు తీయగానే చికిత్స అందజేశారు. మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. బోరుబావిలో పడిన బాలుడిని రక్షించేందుకు 20 గంటల సమయం పట్టింది. అప్పటివరకు చిన్నారికి పైపుల ద్వారా ఆక్సిజన్ అందజేశారు. బోరు బావిలో చిన్నారి తల ముందు పడిందని తెలుస్తోంది. బోరుబావి నుంచి చిన్నారి క్షేమంగా తిరిగి రావడంతో పేరంట్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఆ భగవంతుడే తమ బిడ్డను కాపాడారని కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి:

Arvind Kejriwal: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట.. వ్యక్తిగత నిర్ణయమంటూ ఆ పిటిషన్ తిరస్కరణ

Chief Minister: ప్రధానిని చేస్తామన్నా నేను బీజేపీవైపు వెళ్లను..

మరిన్ని జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 04 , 2024 | 03:28 PM

Advertising
Advertising