Share News

Udayanidhi Stalin: మా మంత్రులంతా డిప్యూటీ సీఎంలే.. ప్రమోషన్ వార్తలపై ఉదయనిధి స్టాలిన్

ABN , Publish Date - Jul 20 , 2024 | 04:17 PM

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, కేబినెట్ మంత్రి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలపై ఆయన శనివారం స్పందించారు. ''డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలే'' అని నవ్వుతూ చెప్పారు.

Udayanidhi Stalin: మా మంత్రులంతా డిప్యూటీ సీఎంలే.. ప్రమోషన్ వార్తలపై ఉదయనిధి స్టాలిన్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, కేబినెట్ మంత్రి, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ (Udayanidhi Stalin) ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలపై ఆయన శనివారం స్పందించారు. ''డీఎంకే ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలే'' అని నవ్వుతూ చెప్పారు. గతంలో కూడా తాను ఇదే చెప్పానని, పోస్ట్ ఏది ఇచ్చినా తనకు అన్నింటికంటే యువజన విభాగం కార్యదర్శి పదవే చాలా ఇష్టమైన పదవి అని వివరించారు.

Kanwar guidelines: ఎక్కడ తినాలో, ఎక్కడ వద్దో యాత్రికులకు తెలుసు... కపిల్ సిబల్ మండిపాటు


2026 ఎన్నికలే మా టార్గెట్

డీఎంకే ప్రస్తుత టార్గెట్ 2026 ఎన్నికల్లో తిరిగి గెలవడమేనని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. గత ఎన్నికల తరహాలోనే తామంతా ఈసారి కూడా కష్టపడి పని చేస్తామని, గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎవరితో పొత్తులు పెట్టుకున్నా తమ నేతలు గెలుస్తారని, తమ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తిరిగి తమిళనాడు సీఎం అవుతారని, కచ్చితంగా 2026లో గెలుపు డీఎంకేదేనని అన్నారు. సోషల్ మీడియాలో యువజన కార్యకర్తలు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పదేసి నిమిషాల చొప్పున కేటాయించాలని కూడా ఆయన సూచించారు.

For More National News and Telugu News..

Updated Date - Jul 20 , 2024 | 04:17 PM