ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Udhayanidhi Stalin: తమిళనాడు మంత్రి ప్రకటన.. ఆ వెంటనే..!

ABN, Publish Date - Aug 10 , 2024 | 07:56 AM

ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు మంత్రి. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, దివంగత కరుణానిధి మనమడు అనే సంగతి తెలిసిందే. సినిమాల నుంచి క్రమంగా రాజకీయాల్లోకి వెళ్లారు. తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తనవంతుగా కృషిచేశారు. దాంతో మంత్రివర్గంలో ఉదయనిధికి చోటు దక్కింది .

Udhayanidhi Stalin

చెన్నై: ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin).. తమిళనాడు మంత్రి. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉదయనిధి స్టాలిన్.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, దివంగత కరుణానిధి మనమడు అనే సంగతి తెలిసిందే. సినిమాల నుంచి క్రమంగా రాజకీయాల్లోకి వెళ్లారు. తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తనవంతుగా కృషిచేశారు. దాంతో మంత్రివర్గంలో ఉదయనిధికి చోటు దక్కింది . మంత్రి తర్వాత ప్రమోషన్ ఎప్పుడూ అనే ఒక్కటే చర్చ.. కొందరు అభిమానులు ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్నారు.



చర్చ ఎందుకంటే..?

తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి రాజకన్నప్పన్ పాల్గొన్నారు. వేదిక మీద మాట్లాడుతూ నోరు జారారు. ‘ప్రభుత్వానికి విద్య, ఆరోగ్యం రెండు కళ్ల లాంటివి. ఇదే విషయాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎప్పుడూ చెబుతుంటారు. విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆ శాఖ మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ పరిధిలోకి వస్తుంది. ఆ వెంటనే తేరుకొని మన మంత్రి ఉదయనిధి స్టాలిన్ శాఖ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ నెల 19వ తేదీ లోపు ఉదయనిధిని డిప్యూటీ సీఎం అనలేమని హింట్ ఇచ్చారు. ఆ తర్వాత అయ్యే అవకాశం ఉంది అని’ మంత్రి రాజ కన్నప్పన్ ముందుగానే చెప్పేశారు. తమిళనాడు మంత్రి చేసిన కామెంట్స్ ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో డిస్కషన్‌కు దారితీసింది.



గట్టిగా కోరుతున్న ఓ వర్గం

ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పార్టీలో ఓ వర్గం గట్టిగా కోరుతుంది. డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ రావడంతో గత వారం డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్ కూడా స్పందించారు. ‘ఉదయనిధిని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పుడు మాత్రం సరైన సమయం కాదు. ఉదయనిధి డిప్యూటీ చీఫ్ అయ్యేందుకు మరింత సమయం పడుతుందని పరోక్షంగా వివరించారు. అప్పటివరకు ఓపిగ్గా వేచి చూడాలి అని’ స్టాలిన్ స్పష్టం చేశారు. ఉదయనిధి అభిమానులు, డీఎంకే యువ నాయకులు మాత్రం వెంటనే డిప్యూటీ సీఎం చేయాలని కోరుతున్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 10 , 2024 | 07:56 AM

Advertising
Advertising
<