ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Lok Sabha Session: 2027నాటికి దేశవ్యాప్తంగా 25వేల జన ఔషధి కేంద్రాలు..

ABN, Publish Date - Aug 02 , 2024 | 03:56 PM

2027 మార్చి 31నాటికి దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 12,616 కేంద్రాలు నెలకొల్పినట్లు ఆమె వెల్లడించారు.

ఢిల్లీ: 2027 మార్చి 31నాటికి దేశవ్యాప్తంగా 25,000 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి దేశవ్యాప్తంగా 12,616 కేంద్రాలు నెలకొల్పినట్లు ఆమె వెల్లడించారు. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన(PMBJP) పథకంపై లోక్ సభలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.


ఈసారి పార్లమెంట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ప్రతిపక్షాలకు సైతం స్పష్టమైన మెజారిటీ రావడంతో వారు మాట్లాడేందుకు ఎక్కువ సమయం దొరుకుతోంది. ఈసారి ఏపీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ సందర్భంగా సభలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకంపై మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి ప్రశ్న లేవనెత్తారు. పథకం కింద ఇప్పటివరకూ ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంత మేర అమ్మకాలు జరిగాయంటూ ఆయన ప్రశ్నించారు.


దీనికి స్పందించిన కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ గత ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా రూ.3,548.79కోట్ల విలువైన ఔషధాలు అమ్మినట్లు, అలాగే 2027నాటికి 25వేల కేంద్రాలు ఏర్పాటే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రూ.8.34కోట్ల మందులు అమ్మినట్లు, అలాగే మచిలీపట్నంలో 07 జన ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ కేంద్రాల్లో 2047రకాల మందులు, 300రకాల సర్జికల్-మెడికల్ వస్తువులు అందుబాటులో ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.


వీటిల్లో ఆనాల్జెసిక్, యాంటీ-పైరేటిక్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-డయాబేటిక్, యాంటీ-బయోటిక్, యాంటీ-ఫంగల్, కార్డియో వస్కులర్, సైకోట్రోపిక్, డెర్మటాలజీ, విటమిన్స్, మినరల్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, రెస్పిరేటరీ, యాంటీ-క్యాన్సర్ సహా అనేక రకాల వ్యాధులకు ఔషధాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి జన ఔషధి కేంద్రాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు.

Updated Date - Aug 02 , 2024 | 04:04 PM

Advertising
Advertising
<