Share News

Viral Video: పేరుకు కేంద్ర మంత్రి.. కానీ స్కీమ్ పేరు రాయడంలో తప్పులు, తప్పులు

ABN , Publish Date - Jun 20 , 2024 | 10:56 AM

ఇటీవల మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) నుంచి కేంద్ర మంత్రిగా ఎంపికైన సావిత్రి ఠాకూర్(Savitri Thakur) గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఆమెపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మోదీ ప్రభుత్వంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఎంపికైన సావిత్రి ఠాకూర్ బేటీ బచావో బేటీ పఢావో నినాదాన్ని సరిగ్గా రాయలేకపోయారు.

Viral Video: పేరుకు కేంద్ర మంత్రి.. కానీ స్కీమ్ పేరు రాయడంలో తప్పులు, తప్పులు
Union Minister Savitri Thakur

ఇటీవల మధ్యప్రదేశ్‌(Madhya Pradesh) నుంచి కేంద్ర మంత్రిగా ఎంపికైన సావిత్రి ఠాకూర్(Savitri Thakur) గురించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో ఆమె గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మోదీ ప్రభుత్వంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఎంపికైన సావిత్రి ఠాకూర్ బేటీ బచావో బేటీ పఢావో నినాదాన్ని సరిగ్గా రాయలేకపోయారు. ఇంటర్ పాస్ అయిన మంత్రి స్లోగన్ సరిగ్గా రాయలేకపోవడంతో అనేక మంది ఆమెను విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో అసలు మంత్రి ఏం చదువుకున్నారని కాంగ్రెస్(congress) నేతలతోపాటు పలువురు ప్రశ్నిస్తున్నారు.


అయితే ధార్ జిల్లా(Dhar district)లో నిర్వహించిన మూడు రోజుల ప్రవేశోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ప్రారంభించారు. ఆ నేపథ్యంలో ఆమె శిక్షా రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. దీనికి ముందు ప్రచార రథం వెనుక ఉన్న బోర్డుపై ‘బేటీ బచావో-బేటీ పఢావో’ అనే నినాదాన్ని రాసి సంతకం చేయాల్సిందిగా సిబ్బంది ఆమెను అభ్యర్థించారు. ఆ అభ్యర్థనపై సావిత్రి ఠాకూర్ లేచి నినాదం చేశారు. కానీ బోర్డుపై బేటీ బచావో బేటీ పఢావో అనే నినాదాన్ని రాయాల్సి ఉండగా.. ఆమె బేడీ పడావో బచావ్ అని రాశారు. కేంద్ర మంత్రి నినాదం తప్పుగా రాసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.


ఆమె అఫిడవిట్ ప్రకారం 46 ఏళ్ల సావిత్రి ఠాకూర్(Savitri Thakur) 12వ తరగతి వరకు చదువుకున్నారు. ధార్ లోక్‌సభ స్థానం నుంచి సావిత్రి ఠాకూర్ 2 లక్షల 18 వేల 665 ఓట్లతో గెలుపొందడం విశేషం. మాల్వాలో ఇది కీలక నియోజకవర్గం. ఇక్కడ జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ(BJP) మూడోసారి విజయం సాధించింది. ధార్ లోక్‌సభ స్థానం ఒకప్పుడు కాంగ్రెస్‌ ఆధిపత్యంలో ఉండేది. ఇటివల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అపూర్వ విజయం సాధించింది.

సావిత్రి ఠాకూర్ ఆమె 2004 నుంచి 2009 వరకు జిల్లా పంచాయతీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆ తర్వాత 2014లో తొలిసారి ఎంపీ(MP) అయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు ఆమె ఓ ఎన్జీవోలో కోఆర్డినేటర్‌గా పనిచేశారు. 12వ తరగతి వరకు చదివిన ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.


ఇది కూడా చదవండి:

Spurious Liquor: కల్తీ మద్యం తాగి 29 మంది మృతి, మరో 60 మందికి అనారోగ్యం..సీఎం స్పందన


NDA Government: వరి, జొన్న, పత్తి సహా 14 పంటలకు మద్దతు ధర పెంపు


ఒమేగా హాస్పిటల్స్‌లోకి రూ.500 కోట్ల పెట్టుబడులు


For Latest News and National News click here

Updated Date - Jun 20 , 2024 | 11:01 AM