ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yogi Adityanath : పేపర్‌ లీక్‌ చేస్తే రూ.కోటి జరిమానా

ABN, Publish Date - Jun 27 , 2024 | 04:20 AM

పోటీ/ప్రవేశ పరీక్ష పేపర్ల లీకేజీలకు పాల్పడేవారికి యావజ్జీవ ఖైదు, రూ.కోటి ఫైన్‌ వంటి కఠిన శిక్షలు విధించేలా ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారు ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ‘

  • రెండేళ్ల నుంచి యావజ్జీవం దాకా జైలు

  • యూపీ సర్కార్‌ ఆర్డినెన్స్‌

లఖ్‌నవూ, ముంబై, జూన్‌ 26: పోటీ/ప్రవేశ పరీక్ష పేపర్ల లీకేజీలకు పాల్పడేవారికి యావజ్జీవ ఖైదు, రూ.కోటి ఫైన్‌ వంటి కఠిన శిక్షలు విధించేలా ఉత్తరప్రదేశ్‌లోని యోగి సర్కారు ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ‘ఉత్తరప్రదేశ్‌ పబ్లిక్‌ ఎగ్జామినేషన్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌)’ పేరిట జారీ చేసిన ఈ ఆర్డినెన్స్‌లో పేర్కొన్న నేరాలకు పాల్పడ్డవారికి బెయిల్‌ రావడం కూడా చాలా కష్టమే.

కారాగారవాసం, జరిమానాలతోనే సరిపెట్టకుండా.. పేపర్‌ లీక్‌ కేసుల్లో భాగస్వాములైనవారి ఆస్తులను సైతం జప్తు చేసే ప్రొవిజన్‌నూ ఈ ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు. పేపర్‌ లీక్‌ కారణంగా పరీక్ష రద్దయితే.. దానివల్ల పడే ఆర్థిక భారాన్ని దోషుల నుంచే వసూలు చేస్తామని యూపీ సర్కారు స్పష్టం చేసింది.

పరీక్షల నిర్వహణలో పాలుపంచుకునే సంస్థలు, సర్వీస్‌ ప్రొవైడర్లు లీకేజీలో భాగమైతే.. వాటిని శాశ్వతంగా బ్లాక్‌లి్‌స్టలో పెడతామని పేర్కొంది. ఇక.. మహారాష్ట్రలో నీట్‌ లీక్‌ కేసులో అరెస్టయిన ఇద్దరు టీచర్లు.. ఈ పరీక్షలో అభ్యర్థులను పాస్‌ చేయించేందుకు ఒక్కొక్కరి వద్ద రూ.5 లక్షలు తీసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది.

Updated Date - Jun 27 , 2024 | 04:20 AM

Advertising
Advertising