ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Himachal Crisis: మళ్లి ఏమైంది విక్రమాదిత్య.. ఫేస్‌బుక్ బయో నుంచి హోదా తొలగింపు

ABN, Publish Date - Mar 02 , 2024 | 04:45 PM

హిమాచల్ ప్రదేశ్‌ ప్రభుత్వంలో నెలకొన్న అసమ్మతి ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడంతో మొదలైన రగడ, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినప్పటికీ.. మంత్రి విక్రమాదిత్య సింగ్ కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా మారారు.

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh) ప్రభుత్వంలో నెలకొన్న అసమ్మతి ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు సభ్యులు క్రాస్ ఓటింగ్ చేయడంతో మొదలైన రగడ, కంటిన్యూ అవుతూనే ఉంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసినప్పటికీ.. మంత్రి విక్రమాదిత్య సింగ్ (Vikramaditya Singh) పక్కలో బల్లెంలా మారారు. అతనితో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మాట్లాడి.. రాజీనామాను వెనక్కి తీసుకునేలా చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా మాద్యమం ఫేస్ బుక్ బయోలో తన హోదాను విక్రమాదిత్య తీసి వేశారు. దీంతో విక్రమాదిత్య కాంగ్రెస్ పార్టీని వీడతారా..? మరో పార్టీలో చేరతారా..? లేదంటే సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తారా..? అనే సందేహాలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: TMC: సుదీప్ బెనర్జీని అరెస్ట్ చేస్తారా..? లేదా..? కునాల్ ఘోష్ బెదిరింపు

ఫేస్ బుక్ బయోలో విక్రమాదిత్య తన హోదాను తొలగించారు. దీంతో అతను పార్టీ మారడం ఖాయం అనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. విక్రమాదిత్య గురించి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సుఖు స్పందించారు. ‘విక్రమాదిత్య పార్టీని వీడతారా..? ఆ సమాచారం తనకు తెలియదు అని’ సుఖు సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యేలకు భద్రతా కల్పించారు కదా మీడియా ప్రతినిధులు సీఎంను ప్రశ్నించారు. ‘రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసు. తమ పార్టీ ఎమ్మెల్యేల చేత క్రాస్ ఓటింగ్ వేయించింది. ఇప్పుడు అదే పార్టీ తమపై ఆరోపణలు చేస్తుంది. విపక్షం ఎప్పుడూ ఆరోపణలు చేస్తూనే ఉంటుంది. దానికి తాము ఏం చేయాలి అని’ సుఖ్విందర్ సుఖు సమాధానం ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 02 , 2024 | 04:45 PM

Advertising
Advertising