Vinesh Phogat: వినేశ్ ఫొగట్ సంచలనం.. ఆ పార్టీలో చేరిక
ABN, Publish Date - Sep 04 , 2024 | 01:34 PM
పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్(Vinesh Phogat) రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ వీడింది. అందరి అంచనాలకు తగినట్లే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
చంఢీగఢ్: పారిస్ ఒలింపిక్స్ 2024లో అనర్హత వేటుకు గురైన స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్(Vinesh Phogat) రాజకీయ రంగ ప్రవేశంపై ఉత్కంఠ వీడింది. అందరి అంచనాలకు తగినట్లే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఆమె వెంట మరో రెజ్లర్ బజరంగ్ పునియా ఉన్నారు. వీరిరువురు రాహుల్‌తో సమావేశమై రాజకీయాలపట్ల తమకున్న ఆసక్తిని వ్యక్తం చేశారు. అనంతరం రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
జరిగిందిదే..
పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్స్ వరకు విషయం తెలిసిందే. తుదిపోరులో అమెరికాకు చెందిన రెజ్లర్ సారా హిండెబ్రాండ్‌తో తలపడాల్సి ఉంది. 100 గ్రాముల అధిక బరువు కారణంగా ఫొగట్ అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో ఆమె పతకాన్ని కోల్పోయారు. స్వదేశం తిరిగి వచ్చిన ఫొగట్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఫొగట్ తెగువను ప్రశంసించారు.
ధైర్యం చెప్పి..
బాధపడొద్దని చెబుతూ ఫొగట్‌కు మనో ధైర్యం నింపారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి హరియాణాలో గల స్వగ్రామం వరకు సాదర స్వాగతం పలికారు. ఫొగట్‌పై పడిన అనర్హత వేటుపై న్యాయపోరాటం చేశారు. భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అడ్‌హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌ను ఆశ్రయించింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు, నిబంధనలను పరిశీలించిన కోర్టు అనర్హత నిర్ణయాన్ని సమర్థించడంతో కోర్టులో ఊరట లభించలేదు.
హరియాణా ఎన్నికల్లో పోటీ..
ఢిల్లీలో రాహుల్ గాంధీతోపాటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్‌తో వినేశ్, బజరంగ్ భేటీ అయ్యారు. త్వరలో జరగబోయే హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. హరియాణాకు ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 34 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ సిద్ధం చేసింది. కాంగ్రెస్ మలివిడత జాబితాలో రెజ్లలిద్దరి పేర్లను పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. వినేశ్ ఇటీవలే ఉత్తరాది రైతుల ఆందోళనల్లో పాల్గొన్నారు. అప్పటి నుంచే ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరిగింది.
For Latest News click here
Updated Date - Sep 04 , 2024 | 02:19 PM