Vinesh Phogat: రైతు నిరసనల్లో పాల్గొన్న వినేష్ ఫోగట్.. రాజకీయ ప్రవేశంపై ఏమన్నారంటే..?
ABN, Publish Date - Aug 31 , 2024 | 03:44 PM
రైతుల నిరసన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒలంపియన్ వినోషె ఫోగట్ శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. పండించిన పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌పై ఆగస్టు 31 నుంచి రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
న్యూఢిల్లీ: రైతుల నిరసన శనివారానికి 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒలంపియన్ వినోషె ఫోగట్ (Vinesh Phogat) శంభు, ఖానౌరీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు ఆందోళనల్లో పాల్గొన్నారు. రాజకీయాల్లోకి వస్తారనే ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. పండించిన పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌పై ఆగస్టు 31 నుంచి రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు.
హర్యానా నుంచి పోటీ చేస్తారా?
హర్యానా నుంచి కాంగ్రెస్ పార్టీ నిలబెడితో పోటీ చేస్తారా అని ఫోగట్‌ను అడిగినప్పుడు "దానిపై మాట్లాడాలనుకోవడం లేదు. నేను నా కుటుంబ సభ్యులను (రైతులను) కలుసుకునేందుకు వచ్చాను. మీరు విషయాన్ని పక్కదారి పట్టిస్తే వారి పోరాటం వృథా అవుతుంది. మీ దృష్టి నాపై కాకుండా రైతాంగంపై ఉంచాలని కోరుతున్నారు. నేను ఒక క్రీడాకారిణిని, భారతీయ పౌరురాలిని. ఎన్నికలనేవి నాకు ప్రధానంకాదు, నా దృష్టి అంతా రైతుల సంక్షేమంపైనే ఉంది'' అని అన్నారు.
PM Modi: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరగాలి
ప్రజలు ఎవరైనా సమస్యలు లెవనెత్తినప్పుడు, వారిని రాజకీయ కోణం నుంచో, రెలిజియన్, కమ్యూనిటీ కోణం నుంచో చూడరాదని ఫోగట్ అన్నారు. సమస్యలు లేవనెత్తి, తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే హక్కు వారికి ఉంటుందన్నారు. రైతుల డిమాండ్లు చట్టబద్ధమైనవని, రైతు కుటుంబం నుంచి తాను వచ్చినందున తనను ఏవిధంగా అమ్మ పెంచిపెద్దచేసిందో బాగా తెలుసునని చెప్పారు. 200 రోజులుగా రైతులు ఇక్కడే కూర్చుని ఉండటం బాధాకరంగా ఉందన్నారు. వీరంతా భారతదేశ పౌరులని, దేశ రైతులని నొక్కిచెప్పారు. రైతులు లేకుండా ఏదీ సాధ్యం కాదని, అథ్లెట్ల అవసరమైన ఆహారం కూడా రైతులు అందిచకుంటే తాము సాధించేది కూడా ఏమీ ఉండదన్నారు. ''చాలాసార్లు మేము నిస్సహాయంగా ఉండిపోతాం. ఏమీ చేయలేం. దేశానికి వివిధ స్థాయిల్లో మేము ప్రాతినిధ్యం వహిస్తుంటాం. సొంత కుటుంబానికి మాత్రం ఏమీ చేయలేకపోతుంటాం'' అని ఆవేదన వ్యక్తం చేసారు.
రైతుల గోడు వినాలి...
ప్రభుత్వం రైతుల గోడు వినాలని ఫోగట్ విజ్ఞప్తి చేసారు. తప్పు చేశామని గత పర్యాయం వారు అంగీకరించారు. వారిచ్చిన హామీలు నెరవేర్చాలి. జనం (రైతులు) ఇదే తరహాలో రోడ్లపై బలవంతంగా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తే దేశం ప్రగతి సాధంచలేదని ఫోగట్ అన్నారు. రైతుల ఉద్యమానికి తాను మద్దతిస్తున్నట్టు చెప్పారు. ''మీ (రైతుల) ఆందోళన ఈరోజుతో 200 రోజులు పూర్తయింది. మీ హక్కులు, న్యాయం కోసం ఇక్కడకు వచ్చారు. మీ ఉద్దేశం నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ కుమార్తెలు మీకు బాసటగా ఉంటారు. మేము కూడా దేశ పౌరులమే, మేము మా వాణి వినిపిస్తుంటే ప్రతిసారి రాజకీయ కోణం నుంచి చూడరాదని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా గోడు వినండి. రైతులు చేస్తున్న డిమాండ్లు ఎంతమాత్రం చట్టవిరుద్ధం కాదు'' అని ఫోగట్ అన్నారు. ఈ సందర్భంగా ఫోగట్‌ను రైతులు సన్మానించారు.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 31 , 2024 | 03:44 PM