ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

National : ఊరట కాస్తంతే..

ABN, Publish Date - Jul 24 , 2024 | 05:05 AM

ఆదాయ పన్ను పరిమితిని ఈసారైనా పెంచకపోతారా అని వేయికళ్లతో వేచిచూస్తున్న వేతనజీవులకు, సగటు మధ్యతరగతి వర్గానికి స్వల్ప ఊరటే దక్కింది.

  • వేతన జీవులను అంతగా కరుణించని నిర్మలమ్మ

  • కొత్త పన్ను విధానంలోకి మారినవారికి మాత్రమే స్వల్ప

National : ఆదాయ పన్ను పరిమితిని ఈసారైనా పెంచకపోతారా అని వేయికళ్లతో వేచిచూస్తున్న వేతనజీవులకు, సగటు మధ్యతరగతి వర్గానికి స్వల్ప ఊరటే దక్కింది. కొత్త పన్ను విధానంలో రిటర్నులు సమర్పించేవారికి మాత్రమే.. అది కూడా వార్షికంగా రూ.10 లక్షలు, అంతకు మించి స్థూల ఆదాయం ఉన్నవారికి మాత్రమే పిసరంత ఊరట కల్పించేలా.. ఆర్థిక మంత్రి నిర్మల రెండు శ్లాబులను సవరించారు. కొత్త విధానంలోని 5, 10 శాతం శ్లాబుల్లో చేసిన సవరణల కారణంగా పన్నుచెల్లింపుదారులకు రూ.17,500 దాకా ఊరట కలుగుతుందని ఆమె తెలిపారు. ఈ సవరణల వల్ల.. స్థూల ఆదాయం రూ.10 లక్షలు ఉన్నవారు కట్టాల్సిన పన్ను రూ.10 వేల మేర, రూ.20 లక్షలు ఉన్నవారు కట్టాల్సిన పన్ను రూ.17,500 మేర మాత్రం తగ్గుతుంది.

అలాగే.. ఇప్పటిదాకా రూ.50 వేలుగా ఉన్న ప్రామాణిక తగ్గింపు (స్టాండర్డ్‌ డిడక్షన్‌)ను కొత్తపన్ను విధానంలో రిటర్నులు దాఖలు చేసేవారికి మాత్రం రూ.75 వేలకు పెంచుతున్నట్టు నిర్మల ప్రకటించారు. కుటుంబ పింఛనుదారులకు ప్రస్తుతం రూ.15 వేలుగా ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ను రూ.25 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. ఇప్పటికీ పాత విధానంలో రిటర్నులు దాఖలు చేస్తున్నవారు బడ్జెట్‌లో తమకు ఎలాంటి ఊరటా లభించకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పాత విధానం శ్లాబులను ఈసారైనా సవరిస్తారని వారంతా భావించారు.


కానీ.. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో మూడింట రెండొంతుల మంది పన్నుచెల్లింపుదారులు కొత్త పన్ను విధానం ఎంచుకున్నారు’ అని బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపిన ఆర్థికమంత్రి.. పాత పన్ను విధానంలో ఉన్నవారిని పట్టించుకోకపోవడంతో వారు ఉసూరుమన్నారు. కాగా.. ఆదాయపన్ను చట్టాన్ని మరింత సంక్షిప్తంగా, సులభగ్రాహ్యంగా చేసేందుకు.. ఆర్నెల్లలోగా సమగ్రంగా సమీక్షించనున్నట్టు నిర్మల వెల్లడించారు.

దీనివల్ల పన్ను తగాదాలు, వ్యాజ్యాలు తగ్గుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే.. రూ.50 లక్షలు అంతకు మించి విలువ కలిగిన స్థిరాస్తుల అమ్మకంపై.. కొనుగోలుదారులకు 1ు టీడీఎస్‌ (మూలం వద్దే పన్నుకోత) వర్తిస్తుందని.. ఒక లావాదేవీలో ఒకరికి మించి అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉన్నా కూడా ఈ పన్ను వర్తిస్తుందని నిర్మల తెలిపారు. అదేవిధంగా.. ఆస్తుల అమ్మకంపై ఇన్నాళ్లుగా ఉన్న ఇండెక్సేషన్‌ లబ్ధిని ఎత్తివేసినట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి.. 12.5%దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వేయనున్నట్టు తెలిపారు. జాతీయ పింఛను పథకం కింద యజమాని వాటా పరిమితిని ప్రస్తుతం ఉన్న 10 శాతం నుంచి 14 శాతానికి పెంచుకోవడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. దీనివల్ల ఉద్యోగుల పెన్షన్‌ నిధి పెరుగుతుందని, ఆమేరకు పన్ను రాయితీ పెరుగుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. అయితే, ఇది కూడా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది.

Updated Date - Jul 24 , 2024 | 05:06 AM

Advertising
Advertising
<