Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి.. వాటిని ఎలా లెక్కిస్తారు?
ABN, Publish Date - Jun 01 , 2024 | 04:58 PM
ఈసారి లోక్‌సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు.. వారం రోజుల గ్యాప్ చొప్పున ఏడు దశల్లో పోలింగ్ సాగింది. ఏడో దశ..
ఈసారి లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections 2024) మొత్తం ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు.. వారం రోజుల గ్యాప్ చొప్పున ఏడు దశల్లో పోలింగ్ సాగింది. ఏడో దశ పోలింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో.. ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పై పడింది. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలతో (Exit Poll Results) దాదాపు ఎవరు విజయం సాధిస్తారనేది తేలుతుంది. అఫ్‌కోర్స్.. వాస్తవ ఫలితాలకు, ఎగ్జిట్ పోల్స్‌కి చాలా తేడా ఉంటుంది. కానీ.. ఎవరిది పైచేయి ఉంటుందనే విషయం మాత్రం ఎగ్జిట్ పోల్స్‌తో దాదాపు తేలిపోతుంది.
అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఏంటి?
ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు.. ఓటర్లు ఓటు వేసిన వెంటనే వారిని ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఓటర్లు ఇచ్చే సమాచారం ఆధారంగా.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేస్తారు. దీనినే ఎగ్జిట్ పోల్స్ అంటారు. నిజానికి.. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో.. ఈ ఎగ్జిట్ పోల్స్‌ని కేంద్ర ఎన్నికల సంఘం నిషేధించింది. ఓటర్లపై ప్రభావం చూపకుండా ఉండేందుకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఓటింగ్ ప్రక్రియ ముగిసిన 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ని రిలీజ్ చేయవచ్చు. అంతేకాదు.. డిబేట్స్, విశ్లేషణలు కూడా నిర్వహించుకోవచ్చు.
ఎగ్జిట్ పోల్స్‌ని ఎలా లెక్కిస్తారు?
వివిధ ఏజెన్సీలు శాంపిల్ మెథడ్స్, స్టాటిస్టికల్ ఎనాలసిస్‌లను కలిపి.. ఎగ్జిట్ పోల్స్‌ని లెక్కిస్తారు. తొలుత ఈ ఏజెన్సీలు ఏరియాల వారీగా ఓటర్ల సమూహాన్ని ఎంపిక చేసుకుంటాయి. ఒక్కో ఓటర్‌ని ఎవరికి ఓటు వేశారు? ఎక్కడ నివనిస్తారు? వంటి ప్రాథమిక ప్రశ్నలు అడుగుతారు. వారిచ్చే సమాధానాలను రికార్డ్ చేసుకుంటారు. నిపుణులు ఈ డేటాని పరిశీలించి, ఎన్నికల ఫలితాల గురించి అంచనా వేసేందుకు విశ్లేషిస్తారు. ఫైనల్‌గా ఈ అంచనాలను ప్రజల ముందు ఉంచుతారు. అయితే.. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలనేవి ఎప్పటికీ సరైనవి కావు.
Read Latest National News and Telugu News
Updated Date - Jun 01 , 2024 | 05:04 PM