ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: వయనాడ్ నుంచే ప్రియాంక పోటీ ఎందుకంటే..?

ABN, Publish Date - Jun 18 , 2024 | 03:07 PM

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అయినా మరోసారి ఎన్నికల అంశం తెరపైకి వస్తోంది. దానికి కారణం వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీచేసి గెలిచారు. అదే సమయంలో ఆయన రాయ్‌బరేలీ నుంచి కూడా గెలవడంతో..

Priyanka Gandhi

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అయినా మరోసారి ఎన్నికల అంశం తెరపైకి వస్తోంది. దానికి కారణం వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీచేసి గెలిచారు. అదే సమయంలో ఆయన రాయ్‌బరేలీ నుంచి కూడా గెలవడంతో.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒకచోట నుంచే ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుంది. దీంతో రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. దీంతో వయనాడ్‌ స్థానానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్ దేశ రాజకీయాల్లో చాలా కీలకమైన రాష్ట్రం. అత్యధిక లోక్‌సభ స్థానాలు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ యూపీలోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా కొనసాగేందుకు ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. మరోవైపు యూపీతో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధం నేపథ్యంలో రాహుల్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అదే సమయంలో రాహుల్ గాంధీ రాజీనామా చేయనున్న వయనాడ్ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంకగాంధీ పోటీచేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే వెల్లడించారు. అసలు వయనాడ్ నుంచి ప్రియాంక ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారనేది ఆసక్తిగా మారింది. అసలు ప్రియాంక నిర్ణయం వెనుక కారణాలు ఏమిటో తెలుసుకుందాం.

Delhi: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి జమ్మూకశ్మీర్‌ బాధ్యతలు..


2004 నుంచి ప్రచారంలో..

ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయకపోయినా.. ఆమె 2004 నుండి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. సరిగ్గా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం మొదలుపెట్టిన 20 సంవత్సరాల తర్వాత తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నారు. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ గెలిస్తే గాంధీ కుటుంబం నుంచి పార్లమెంట్‌లో సంఖ్య పెరగడంతో పాటు.. కాంగ్రెస్‌కు బలం పెరుగుతుంది. ఇటీవల కాలంలో చాలా మంది బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడారు. ఈక్రమంలో ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయాలని.. తద్వారా కాంగ్రెస్‌కు అదనపు బలం చేకూరుతుందని పార్టీ శ్రేణులు కోరుతూ వచ్చారు. అయితే రాహుల్ గాంధీ వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ప్రియాంక ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేస్తారనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లైంది. రాహుల్ గాంధీ ఖాళీ చేస్తున్న స్థానంలో అదే కుటుంబానికి చెందిన వ్యక్తిని పోటీకి పెట్టడం ద్వారా సులభంగా గెలవడంతో పాటు.. దక్షిణాదిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలవుతుందనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రియాంక వయనాడ్ బరిలో దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేస్తారనే చర్చ మొదలైంది. ఆమె పోటీచేయాలంటూ కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో పోస్టర్లు వేశారు. మరోవైపు ప్రియాంక ప్రచారానికి వెళ్లినచోట అక్కడి కార్మికులు, స్థానికులు ఆమెను తమ ప్రాంతం నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని అభ్యర్థించేవారు. ఎన్నికల్లో పోటీ గురించి ప్రియాంకను ప్రశ్నించినప్పుడల్లా.. ఆమె ఏదో ఒకవిధంగా తప్పించుకునేవారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఆ ప్రశ్నకు సమాధానం దాటవేస్తూ వచ్చింది. సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లినప్పటి నుంచి.. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి ప్రియాంక గాంధీ పోటీచేస్తారనే ప్రచారం జరిగింది. మరోవైపు రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీకి దూరంగా ఉంటే ఆ స్థానంలో ప్రియాంక పోటీచేస్తారనే చర్చ జరిగింది. చివరకు రాహుల్ రాయ్‌బరేలీ నుంచి పోటీచేయగా.. అమేథి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కెఎల్ శర్మ పోటీ చేశారు. దీంతో ప్రియాంక పోటీకి సంబంధించిన చర్చకు తెరపడింది. మళ్లీ ఇప్పుడు రాహుల్ వయనాడ్ ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక పోటీచేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.


తొలిసారిగా..

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నారు. కేరళలోని వయనాడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఆమె పోటీచేస్తారు. రాయ్‌బరేలీతో గాంధీ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని.. అందుకే రాహుల్ రాయ్‌బరేలీ స్థానాన్ని ఎంచుకున్నారని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు రాహుల్‌ను రెండోసారి ఎంపీగా ఎన్నుకున్న వయనాడ్ ప్రజల సంగతేమిటి అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ప్రియాంక గాంధీ గతంలో ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ అనేక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక కీలకంగా వ్యవహరించారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు కుదుర్చుకోవడంలో ప్రియాంక ముఖ్య భూమిక పోషించారు. 2018లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రుల ఎంపికలో ప్రియాంక కీలక పాత్ర పోషించారు. 2020లో రాజస్థాన్‌లో సచిన్ పైలట్‌ తిరుగుబాటు చేసినప్పుడు ప్రియాంక రంగంలోకి దిగి సచిన్ పైలట్‌ను శాంతింపజేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలను ప్రియాంక నిర్వర్తించారు. ప్రస్తుతం వయనాడ్ పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయనున్నారు. అయితే వయనాడ్ స్థానానికి ఉప ఎన్నిక కోసం ఇంకా నోటిఫికేషన్ రావాల్సిఉంది.


Chennai: ఎయిర్‌పోర్ట్‌కు మళ్లీ బాంబు బెదిరింపు.. రాత్రంతా కొనసాగిన తనిఖీలు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latets Telugu News

Updated Date - Jun 18 , 2024 | 03:07 PM

Advertising
Advertising