Lok Sabha Elections: రాహుల్‌కు అగ్ని పరీక్ష.. ఆ ప్రశ్నకు నో ఆన్సర్..!
ABN, Publish Date - May 08 , 2024 | 12:27 PM
దేశంలో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు రాహుల్‌గాంధీకి అగ్నిపరీక్షగా మారాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పటికీ.. కాంగ్రెస్ నాయకులు ఎక్కువమంది రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
దేశంలో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు రాహుల్‌గాంధీకి అగ్నిపరీక్షగా మారాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి తమ ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించనప్పటికీ.. కాంగ్రెస్ నాయకులు ఎక్కువమంది రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే రాహుల్ ప్రధాని కావాలంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇండియా కూటమికి మెజార్టీ సీట్లు వస్తే రాహుల్ ప్రధానమంత్రి పదవి పోటీలో ఉండటానికి ఈ ప్రచారం ఉపయోగపడవచ్చు. కానీ కాంగ్రెస్ అనుకున్న సీట్లు సాధించకపోయినా.. వంద లోపు సీట్లకు పరిమితమైతే మాత్రం రాహుల్ గాంధీ రాజకీయంగా మరిన్ని విమర్శలు ఎదుర్కొవల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా భారత్ జోడో, న్యాయ యాత్ర పేరుతో పర్యటించినా కాంగ్రెస్ ప్రదర్శన ఆశాజనకంగా లేకపోతే రాహుల్ రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.
మరోవైపు రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేస్తున్నారు. తాను సిట్టింగ్ ఎంపీగా ఉన్న వయనాడ్‌తో పాటు.. తన తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీలో ఉన్నారు. వయనాడ్‌లో రాహుల్ గెలవడానికి ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాయ్‌బరేలీ నుంచి పోటీచేయడం రాహుల్‌కు మరో అగ్నిపరీక్షగా మారిందంటున్నారు రాజకీయ పండితులు. రెండు చోట్ల గెలిస్తే ఎక్కడి నుంచి ఎంపీగా కొనసాగుతారనేదానిపై రాహుల్ ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. వయనాడ్‌లో పోలింగ్ పూర్తయ్యే వరకు రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ నుంచి పోటీచేసే అంశంపై ప్రకటన చేయలేదు. ముందే ప్రకటన చేసి ఉంటే వయనాడ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఉద్దేశంతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జూన్4 తర్వాత రాహుల్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. మరోవైపు రాయ్‌బరేలీ మొత్తం ఇదే ప్రచారం జరుగుతోంది.
AIMIM: పది లోక్‌సభ స్థానాల్లో మజ్లిస్ పోటీ
రెండు చోట్ల నుంచి..
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ స్థానంతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ స్థానం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వయనాడ్ స్థానానికి రెండో దశలో ఓటింగ్ పూర్తైంది. రాయ్ బరేలీ స్థానానికి ఐదో దశలో ఓటింగ్ జరగనుంది. రాయ్‌బరేలీ రాజకీయాల్లో ఒకటే చర్చ. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ గెలిస్తే ఏ సీటును వదిలిపెడతారనే చర్చ ఎక్కువగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తో పాటు రాహుల్ గాంధీ సైతం ఈ ప్రశ్నపై మౌనం వహిస్తున్నారు. 2019లో రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. అమేథీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయినప్పటికీ, వయనాడ్ నుంచి రాహుల్ గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ ఆయనను వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ స్థానం నుంచి బరిలోకి దింపింది. రాయ్‌బరేలీ సీటు ఆయన గాంధీ కుటుంబానికి సంప్రాదాయక సీటుగా ఉంది. తల్లి సోనియా గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మోడీ హవాలో కూడా సోనియా గాంధీ రాయ్‌బరేలీ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఈ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీచేస్తున్నారు. ఈ పరిస్థితిలో రాహుల్ గాంధీ రాయ్ బరేలీ, వయనాడ్‌లో గెలిస్తే ఏ సీటును వదిలేస్తారనేది పెద్ద ప్రశ్నగా ఉంది.
గాంధీ కుటుంబానికి..
రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ వేసిన తర్వాత రాహుల్ గాంధీ ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.. రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ వేయడం తనకు ఎమోషనల్ మూమెంట్ అన్నారు. అమ్మ ఎంతో నమ్మకంతో కుటుంబ బాధ్యతలను తనకు అప్పగించి సేవ చేసే అవకాశం కల్పించారని తెలిపారు. అమేథీ, రాయ్‌బరేలీ తనకు వేర్వేరు కాదని, రెండూ ప్రాంతాలు తన కుటుంబమని తెలిపారు. అన్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న న్యాయ పోరాటంలో, ప్రజల ఆశీర్వాదాలు కోరుతున్నానని తెలిపారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ పోరాటంలో ప్రజలు తనకు అండగా నిలుస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. దీంతో ప్రజల్లో అనేక అనుమానాలు మొదలయ్యాయి. రాయ్‌బరేలీలో గెలుపు కోసమే ఇలా మాట్లాడారా.. ఫలితాల తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా ఉంటారా.. వదిలేసుకుంటారా అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
ఇదే అతి పెద్ద ప్రశ్న..
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తుందనే ఆ పార్టీ ముందున్న అతి పెద్ద ప్రశ్నగా కనిపిస్తోంది. రాహుల్ గాంధీ పోటీచేస్తున్న రెండు నియోజకవర్గాల్లో విజయం ఖాయమని భావిస్తున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ సీటును వదులుకుంటారో కాంగ్రెస్, రాహుల్ గాంధీ స్పష్టం చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాయ్‌బరేలీలోని వివిధ వాట్సాప్ గ్రూపుల్లో రాహుల్ గాంధీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాయ్‌బరేలీ సీటును తన వద్దే ఉంచుకుంటారని, వయనాడ్ సీటును వదులుకుంటారని ప్రచారం జరుగుతోంది. రాయ్‌బరేలీ సీటుతో గాంధీ కుటుంబానికి నాలుగు తరాల అనుబంధం ఉందంటూ ఈ ప్రచారం జరుగుతోంది. అంటే రాహుల్ రాయ్ బరేలీ సీటును ఉంచుకుని వయనాడ్‌ను వదిలేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రతిచోట ఇదే చర్చ..
సోషల్ మీడియాలోనే కాదు రాయ్ బరేలీలోని టీ దుకాణం నుంచి ప్రధాన కూడళ్ల వరకు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ, నానమ్మ ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన సీటును ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోరని చెబుతున్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ ఎంపీగానే కొనసాగుతారని, రాయ్‌బరేలీలో గెలిచినా ఉపయోగం లేదు.. ఉప ఎన్నికల వస్తుందంటూ గత నాలుగు రోజులుగా రాయ్‌బరేలీలోని వాట్సప్ గ్రూపుల్లో చర్చ జరుగుతోంది. దీంతో రాహుల్ రాయ్‌బరేలీలోనే ఉంటారని కాంగ్రెస్ ప్రచార వేగాన్ని పెంచింది. మొత్తానికి రాహుల్ ముందున్న ప్రశ్నకు ప్రస్తుతానికి కాంగ్రెస్ ఎలాంటి సమాధానం ఇవ్వడంలేదు. జూన్4 తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే ఛాన్స్ ఉంది.
Patna: ముస్లింలందరికీ రిజర్వేషన్లు ఉండాలి
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest National News and Telugu News
Updated Date - May 08 , 2024 | 12:37 PM