ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

No Exercise: శారీరక శ్రమలేని పెద్దలు..!!

ABN, Publish Date - Jun 27 , 2024 | 03:02 AM

భారత్‌లోని పెద్దల్లో దాదాపు సగం మంది అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయడం లేదట! నడక, వ్యాయామం లాంటివేమీ చేయరట! 2000 సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య 22.3 శాతం ఉంది.

No Exercise

  • సగం మంది భారతీయులు వ్యాయామం చేయట్లేదు

  • శారీరక శ్రమ లేని పెద్దలు 49.4%

  • పురుషుల కంటే మహిళలే ఎక్కువ!

  • ఇలాగైతే దేశంలో 2030 నాటికి.. 60%మంది శారీరక నిర్బలురవుతారు

  • దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు

  • ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

  • ‘లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌’లో వ్యాసం


న్యూఢిల్లీ, జూన్‌ 26: భారత్‌లోని పెద్దల్లో దాదాపు సగం మంది అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయడం లేదట! నడక, వ్యాయామం లాంటివేమీ చేయరట! 2000 సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య 22.3 శాతం ఉండగా.. 2022 నాటికి 49.4 శాతానికి పెరిగిపోయింది! ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ అధ్యయనం ‘లాన్సెట్‌ గ్లోబల్‌ హెల్త్‌’లో ప్రచురితమైంది. కనీస వ్యాయామం చేయని వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండటం మరో విశేషం.


వ్యాయామం చేయడం లేదు

2022 నాటికి శరీరానికి అవసరమైనంతగా వ్యాయామం చేయని పురుషులు 42 ఉంటే మహిళలు ఏకంగా 57.2 ఉన్నారు. ఇలాగే కొనసాగితే 2030కి దేశంలోని పెద్దల జనాభాలో 60 శాతానికి పైగా శారీరకంగా నిర్బలురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. శారీరక శ్రమ లేకపోవడం వల్ల గుండె జబ్బులు, టైప్‌2 మధుమేహం, మతిమరుపు, క్యాన్సర్ల వంటి వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని తెలిపింది.


భారత్ స్థానం ఎంత అంటే..?

పెద్దలు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల పాటు వ్యాయామం చేయాలని సూచించింది. కఠినమైన వ్యాయామం వారానికి 75 నుంచి 150 నిమిషాలు చేయాలని పేర్కొంది. ఇక ప్రపంచంలోని 195 దేశాల్లో సరిపడినంత వ్యాయామం చేయని దేశాల జాబితాలో భారత్‌ 12వ స్థానంలో ఉంది.


మహిళలే ఎక్కువ..!!

2022లో ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మంది వైద్యుల సిఫారసు మేరకు వ్యాయామం చేయడం లేదు. శారీరక శ్రమ లేకపోవడం అనేది ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు పెనుముప్పు అని, ప్రజలు తీవ్రమైన జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ (హెల్త్‌ ప్రమోషన్‌) క్రెచ్‌ తెలిపారు. శారీరక శ్రమ లేని వారిలో అంతర్జాతీయంగా పురుషుల (29%) కంటే మహిళలే (34%) ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 10:22 AM

Advertising
Advertising