ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Who is The PM fo India: దేశ తదుపరి ప్రధాని ఎవరు? మోదీకి ఛాన్స్ ఇస్తారా?

ABN, Publish Date - Jun 04 , 2024 | 06:04 PM

Prime Minister Of India: దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలూ వచ్చేశాయి.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో అసలు చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంతకాలం మోదీ 3.0 సర్కార్ వస్తుందని అంతా అనుకున్నా.. సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి ఎగబడి.. మోదీ నామం జపించినా..

PM Narendra Modi

Prime Minister Of India: దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలూ వచ్చేశాయి.. కానీ, ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఓటర్లు. ఎవరికీ పూర్తిస్థాయి మెజార్టీ ఇవ్వకపోవడంతో.. మళ్లీ సంకీర్ణ సర్కార్ అనివార్యమైంది. దీంతో అసలు చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఇంతకాలం మోదీ 3.0 సర్కార్ వస్తుందని అంతా అనుకున్నా.. సీన్ రివర్స్ అయ్యింది. ఎగ్జిట్ పోల్స్ ఎగబడి ఎగబడి.. మోదీ నామం జపించినా.. అన్నీ ఉత్తి ముచ్చట్లే అయ్యాయి. 340, 350, 370, 400 ఇలా ఒక్కో ఎగ్జిట్ పోల్ ఒక్కో నెంబర్ ప్రకటించాయి. కానీ.. ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చాక గానీ.. అసలు తత్వం బోధపడలేదు రాజకీయ నేతలు, ప్రజలకు. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సంతగి అటుంచితే.. ఎన్డీయే కూటమి మొత్తానికి కలిపి 295 సీట్లు దాటే పరిస్థితి కనిపిస్తేలేదు. అదే సమయంలో ఇండియా కూటమి 230 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది.


ప్రధాని ఎవరు..?

ఈ సంగతి ఇలా ఉంచితే.. దేశానికి తదుపరి ప్రధాని ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పదేళ్లు అప్రతీహతంగా దేశాన్ని ఏలిన నరేంద్ర మోదీ.. ఇప్పుడు మరోసారి ఆ పదవిని అధిరోహిస్తారా? లేదా? అనేది సందేహాత్మకంగా మారింది. అవును.. బీజేపీకి మేజిక్ ఫిగర్ సీట్లు రాకపోవడం, ఎన్డీయే కూటమిలో రెండు, మూడు పార్టీల భాగస్వామ్యం కీరోల్ కావడం.. వారు మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవతుండటంతో.. ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అవును.. ఎన్డీయే కూటమి 292 స్థానాల్లో మెజార్టీలో కొనసాగుతోంది. దాదాపు ఇవే స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంది. వీలేతై తగ్గే ఛాన్స్ కూడా ఉంది కానీ.. పెరిగే ఛాన్స్ అయితే లేదు. ఈ కూటమిలో ఇప్పుడు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కీలక పాత్ర పోషించనున్నాయి. ఎందుకంటే.. బీజేపీ సింగిల్‌గా 242 సీట్లలో మాత్రమే మెజార్టీ సాధించింది. అంటే ఈ పార్టీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలంటే ఇంకా 30 సీట్లు కావాల్సి(ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 272) ఉంటుంది. ఇందులో టీడీపీకి 16 సీట్లు, జేడీయూ 12 సీట్లలో గెలుపొందాయి. ఈ రెండూ పార్టీలకు కలిపి 28 సీట్లు ఉన్నాయి. 292లో ఈ రెండు పార్టీలవే 28 స్థానాలు పోతే.. మిగిలిన 264 సీట్లు ఎన్డీయేకి ఉంటాయి. అంటే మేజిక్ ఫిగర్‌కు 8 సీట్లు తక్కువ అనమాట. అందుకే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఎన్డీయే కూటమిలో కీరోల్ పోషించనున్నాయి. అంతేకాకుండా.. ఎన్డీయేలోని మరికొన్ని చిన్నా చితకా పార్టీలు కూడా మోదీ ప్రధాని అభ్యర్థిత్వంపై అభ్యంతరం తెలిపే అవకాశం ఉంది.


మోదీని మార్చాలని కోరే అవకాశం..

వాస్తవానికి ఎన్డీయే కూటమిలోని చాలా పార్టీలు మోదీ ప్రధాని అభ్యర్థిత్వంపై అంతర్గతంగా తీవ్ర అసంతృప్తితో ఉంటూ వస్తున్నాయి. కానీ, ప్రజల్లో ఉన్న పాపులారిటీ కారణంగా.. ఆ అసంతృప్తిని బయటకు చెప్పలేకపోవడం, అధికారాన్ని వదులుకోవడం ఇష్టం లేని కారణంగానూ వెల్లడించలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటవ్వాలంటే కూటమిలో ప్రతి పార్టీ కీలకమే. అందుకే.. వారు చెప్పినట్లు బీజేపీ వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితులను చూస్తుంటే మాత్రం ఈసారి మోదీ నాయకత్వాన్ని తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కూటమిలోని ఆయా పార్టీలు మోదీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ప్రధాని పదవిపై ఎప్పటి నుంచో కన్నేసిన.. జేడీయూ నేత నితీష్ కుమార్ ఈ విషయంలో ముందుంటారనే టాక్ నడుస్తోంది. అయనే కాదు.. మిగతా పార్టీలు కూడా మోదీకి బదులుగా మరొకరి పేరును ప్రతిపాదించాలని కోరే ఛాన్స్ ఉంది. ఈ కారణంగానే.. ఇప్పుడు దేశ తదుపరి ప్రధాని ఎవరు? అనే డిస్కషన్ బలంగా వినిపిస్తోంది.

మరి దొరికిన అవకాశాన్ని వినియోగించుకుని.. ఎన్డీయే కూటమిలోని మోదీ వ్యతిరేకులంతా ఏకమవుతారా? లేక ఎలాగైతేనేం తమ ప్రభుత్వం ఏర్పడితే చాలు అని మోదీకే జై కొడతారా? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఈ వ్యవహారం తేలాలంటే ఒకటి రెండ్రోజులు ఎదురు చూడాల్సిందే.

For More National News and Telugu News..

Updated Date - Jun 04 , 2024 | 10:32 PM

Advertising
Advertising