ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Trendign News : భర్తకు విచిత్ర కోరిక.. పిల్లలు పుట్టకుండా సర్జరీ చేయించుకున్న భార్య..

ABN, Publish Date - Apr 07 , 2024 | 12:13 PM

భార్యా భర్త ముగ్గురు పిల్లలతో చక్కగా సాగిపోతున్న ఆ కుటుంబంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మరింత మంది పిల్లలు కావాలని భర్త కోరడంతో భార్య కుటుంబ నియంత్రణ సర్జరీ చేయించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ ( Uttar Pradesh ) లోని ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది.

భార్యా భర్త ముగ్గురు పిల్లలతో చక్కగా సాగిపోతున్న ఆ కుటుంబంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. మరింత మంది పిల్లలు కావాలని భర్త కోరడంతో భార్య కుటుంబ నియంత్రణ సర్జరీ చేయించుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ ( Uttar Pradesh ) లోని ఆగ్రాలో వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న భర్త భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో ఏం చేయాలో తోచక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు ఎక్కువ మంది పిల్లలు కావాలని, కానీ భార్య తనకు సహకరించడం లేదని భర్త వాపోయాడు. అంతే కాకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సర్జరీ చేయించుకుందని వెల్లడించాడు.


Ayodhya: డిసెంబర్ నాటికి అచ్చెరువొందేలా అయోధ్య.. సమావేశంలో కీలక నిర్ణయాలు..

ఆగ్రాలోని ఇరాదత్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళకు 2018లో తాజ్‌గంజ్‌లో వివాహం జరిగింది. భర్త తహసీల్‌లో కాంట్రాక్టు ఉద్యోగి. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. ఇంకా తనకు పిల్లలు కావాలని భర్త కోరడంతో భార్య అవాక్కైంది. ముగ్గురు పిల్లలను చక్కగా పోషించుకుందామని కోరింది. అయినా భర్త పట్టించుకోలేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఎవరికీ చెప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. విషయం తెలుసుకున్న భర్త బాధితురాలని ఇంట్లో నుంచి గెంటేశాడు.


Congress: పాకిస్తాన్ కోసమే కాంగ్రెస్ మేనిఫెస్టో.. సీఎం ఘాటు వ్యాఖ్యలు..

దీంతో ఎనిమిది నెలలుగా బాధితురాలు తన తల్లి ఇంట్లోనే ఉంటోంది. విషయం పోలీస్ స్టేషన్ కు చేరడంతో పోలీసులు కౌన్సెలింగ్ సెంటర్ నిర్వాహకులను ఆశ్రయించారు. వారు భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిర్చారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 07 , 2024 | 12:13 PM

Advertising
Advertising