Share News

Rahul Gandhi: అయోధ్యలో ఓడించాం, ఇక గుజరాత్ వంతు..

ABN , Publish Date - Jul 06 , 2024 | 03:29 PM

అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్‌ లోనూ బీజేపీని, నరేంద్ర మోదీని కలిసికట్టుగా ఓడిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రామమందిరం ఆధారంగా బీజేపీ చేపట్టిన ఉద్యమాన్ని అయోధ్యలో ఇండియా కూటమి ఓడించిందని అహ్మదాబాద్‌లో శనివారంనాడు ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలతో సమావేశంలో చెప్పారు.

Rahul Gandhi: అయోధ్యలో ఓడించాం, ఇక గుజరాత్ వంతు..

అహ్మదాబాద్: అయోధ్యలో బీజేపీని ఓడించినట్టే గుజరాత్‌ (Gujarat)లోనూ బీజేపీని, నరేంద్ర మోదీని కలిసికట్టుగా ఓడిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. రామమందిరం ఆధారంగా బీజేపీ చేపట్టిన ఉద్యమాన్ని అయోధ్యలో ఇండియా (I.N.D.I.A.) కూటమి ఓడించిందని అహ్మదాబాద్‌లో శనివారంనాడుడు ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తలతో సమావేశంలో చెప్పారు.

Tamil Nadu: ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య.. స్పందించిన మాయావతి


''రామమందిరం ఆధారంగా చేసుకుని బీజేపీ ఉద్యమం చేసింది. దీనిని ఎల్‌కే అడ్వాణీ ప్రారంభించారు. ఆయన రథయాత్ర చేపట్టినప్పుడు మోదీ ఆయనకు సహకారం అందించారు. కానీ వారు (బీజేపీ) రామందిరాన్ని ప్రారంభించినప్పుడు అక్కడ అదానీ, అంబానీలే తప్ప ఒక్క పేదవాడు కూడా కనిపించలేదు'' అని రాహుల్ అన్నారు. అయోధ్యలో ఓడించినట్టే గుజరాత్‌లోనూ బీజేపీని, నరేంద్రమోదీని ఓడించనున్నామని చెప్పారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం పేరుతో పేదల భూములను లాక్కున్నారని, రామాలయ ప్రారంభోత్సవానికి అయోధ్య నుంచి ఒక్కరిని కూడా ఆహ్వానించకపోవడంతో వారు మనస్తాపానికి గురయ్యారని చెప్పారు. అడ్వాణీ ఉద్యమానికి కేంద్ర స్థానమైన అయోధ్యలోనే వారిని ఇండియా కూటమి ఓడించిందన్నారు. తొలుత అయోధ్య నుంచి పోటీ చేయాలని ప్రధానమంత్రి మోదీ అనుకున్నారని, అయితే సర్వేలన్నీ ఆయన ఓడిపోతారని, రాజకీయ కెరీర్ ముగిసిపోతుందని చెప్పాయని వివరించారు. తనకు దేవుడితోనే డైరెక్ట్ కనెక్షన్ ఉందని మోదీ చెబుతున్నారని, అలాంటప్పుడు 2024 లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య నుంచి బీజేపీ ఎందుకు ఓడిపోయిందని రాహుల్ ప్రశ్నించారు. కాగా, రాహుల్ గుజరాత్ పర్యటనలో భాగంగా ఇటీవల రాజ్‌కోట్ జోన్ అగ్నిప్రమాదం, వడోదరలో పడవ మునక, మోర్బీ వంతన కుప్పకూలిన ఘటనల్లో మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 06 , 2024 | 03:29 PM