ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నో మ్యారేజ్‌.. నో సెక్స్‌!

ABN, Publish Date - Nov 10 , 2024 | 02:32 AM

అమెరికా ఆడవాళ్లకు అక్కడి మగాళ్లపై పీకల్దాక కోపమొచ్చింది. కమలా హారి్‌సను కాదని ట్రంప్‌కు ఓట్లేసి గెలిపించినందుకు పురుష పుంగవులపై లక్షల సంఖ్యలో మహిళామణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

  • కమలను కాదని ట్రంప్‌ను గెలిపించినందుకు..

  • అమెరికాలో పురుషులపై మహిళల గుస్సా

  • దక్షిణకొరియా మహిళల ఉద్యమం స్ఫూర్తితో

  • నో మ్యారేజ్‌.. నో సెక్స్‌.. నో కిడ్స్‌!

న్యూఢిల్లీ, నవంబరు 9: అమెరికా ఆడవాళ్లకు అక్కడి మగాళ్లపై పీకల్దాక కోపమొచ్చింది. కమలా హారి్‌సను కాదని ట్రంప్‌కు ఓట్లేసి గెలిపించినందుకు పురుష పుంగవులపై లక్షల సంఖ్యలో మహిళామణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ట్రంప్‌ స్త్రీవాద వ్యతిరేకి అని కన్నీటి పర్యంతమవుతూ వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. వీరిలో వేల సంఖ్యలో తరుణులైతే తమ ఈ కోపానికి ప్రతీకార రూపాన్నిచ్చి మగవారిపై కసి తీర్చుకోవాలనుకుంటున్నారు. దక్షిణకొరియాలో తమ హక్కులను కాలరాస్తున్నారనే ఆగ్రహంతో అక్కడి మహిళలు 4బీ ఉద్యమం సాగించినట్లుగా. అందులో ప్రధానమైంది భర్తలను శృంగారానికి దూరంగా ఉంచడం. అంటే.. పడకమీదకు చేరిన భర్తకు ‘నో సెక్స్‌’ అని తేల్చి చెబుతారన్నమాట! ఇంకా మగవారితో సంబంధాలే కొనసాగించకపోవడం, అసలు పెళ్లిళ్లకే దూరంగా ఉండటం, ఒకవేళ పెళ్లి చేసుకున్నా పిల్లల్ని కనకపోవడం వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్నారట!

Updated Date - Nov 10 , 2024 | 02:33 AM