ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

UP: అతి విశ్వాసమే దెబ్బ తీసింది.. లోక్ సభ ఫలితాలపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలనం

ABN, Publish Date - Jul 14 , 2024 | 09:50 PM

లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మారని అందుకే లోక్ సభ ఫలితాల్లో బీజేపీ వెనకబడిందని యూపీ(Uttar Pradesh) సీఎం యోగీ ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) పేర్కొన్నారు. యూపీలో ఆదివారం జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.

లఖ్‌నవూ: లోక్ సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల మోసపూరిత మాటలను ప్రజలు నమ్మారని అందుకే లోక్ సభ ఫలితాల్లో బీజేపీ వెనకబడిందని యూపీ(Uttar Pradesh) సీఎం యోగీ ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) పేర్కొన్నారు. యూపీలో ఆదివారం జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గెలుపుపై అతి విశ్వాసం పెట్టుకోవడం వల్లే బీజేపీ దెబ్బ తిందని.. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రమే పొందగలిగిందన్నారు.


"ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ సమర్థంగా పని చేసింది. 2014 నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల వరకు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొన్నాం. 2014లో మనకు వచ్చిన ఓట్ల శాతంతోనే 2024లోనూ విజయం సాధించాం. కానీ ఈ సారి చాలా మార్పు వచ్చింది. ఓట్ల శాతాన్ని తిరిగి పొందినప్పటికీ, విపక్షాల ఓట్ల శాతం పెరిగింది. గెలుపుపై అతి విశ్వాసమే దీనికి కారణం అనడంలో సందేహం లేదు. ఇకపై ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా పని చేయాలి. ప్రతి కార్యకర్త కష్టంలో నాయకులు వెంటే ఉండాలి. ఉత్తరప్రదేశ్‌లో మన ప్రభుత్వం శాంతిభద్రతలను పరిరక్షిస్తోంది. విపక్షాలు హింసను ప్రేరేపించాలని చూసినా డబల్ ఇంజిన్ సర్కార్ వాటిని తిప్పికొట్టింది’’ అని యోగి పేర్కొన్నారు.


దేశవ్యాప్తంగా ఇటీవలే జరిగిన 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి 10 సీట్లు, స్వతంత్ర అభ్యర్థి ఒక చోట గెలవగా, బీజేపీ 2 స్థానాల్లోనే గెలుపొందింది. ఈ ఫలితాల తరువాత యోగీ చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశం అయ్యాయి.

Read International News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 09:50 PM

Advertising
Advertising
<