Share News

అంతరిక్షంలో ప్రతిధ్వనించే భారతీయ స్వరం

ABN , Publish Date - Jul 18 , 2024 | 12:54 AM

1977లో అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సౌర వ్యవస్థ మరియు అంతరిక్షం గురించి పరిశోధనలు చేయడానికి పంపిన వ్యోమనౌక వోయేజర్‌-1 లో ప్రపంచ ప్రఖ్యాత కళాకారులైన బీథోవెన్‌, మొజార్ట్‌ల స్వరాలతో పాటు మన దేశంనుండి...

అంతరిక్షంలో ప్రతిధ్వనించే భారతీయ స్వరం

1977లో అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సౌర వ్యవస్థ మరియు అంతరిక్షం గురించి పరిశోధనలు చేయడానికి పంపిన వ్యోమనౌక వోయేజర్‌-1 లో ప్రపంచ ప్రఖ్యాత కళాకారులైన బీథోవెన్‌, మొజార్ట్‌ల స్వరాలతో పాటు మన దేశంనుండి పంపబడిన స్వరం కేసర్‌ బాయి కేర్కర్‌ ది. కేసర్‌బాయి కేర్కర్‌ భైరవి రాగంలో ఆలపించిన ‘జాత్‌ కహా హో అనే గీతం బంగారు పూతతో ఉన్న 12 అంగుళాల డిస్క్‌లో రికార్డ్‌ చేయబడి అంతరిక్షానికి పంపబడింది. 1977లో ఆవిడ మరణించిన సంవత్సరం లోనే ఆమె ఆలపించిన గీతం వోయేజర్‌ చేత పంపబడింది. అది నలభై సంవత్సరాలుగా అంతరిక్షంలో భారతీయ హిందుస్తానీ సంగీతాన్ని వినిపిస్తూనే ఉంది. పద్మ భూషణ్‌ కేసర్‌బాయి కేర్కర్‌ గీతం అంతరిక్షంలోకి ఎలా పంపబడిందనే కథను నేహా సింగ్‌ ‘ఎ సాంగ్‌ ఇన్‌ స్పేస్‌’ అనే పుస్తకంగా రాశారు.

Updated Date - Jul 18 , 2024 | 12:54 AM