Navya Kitchen : పుదీనా పనీర్ వేపుడు
ABN, Publish Date - Jul 06 , 2024 | 05:52 AM
పనీర్- 300 గ్రాములు, నూనె- రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి- 6 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి- 4 (పొడువుగా సన్నగా కట్ చేసుకోవాలి)...
కావాల్సిన పదార్థాలు
పనీర్- 300 గ్రాములు, నూనె- రెండు టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి- 6 (సన్నగా తరగాలి), పచ్చిమిర్చి- 4 (పొడువుగా సన్నగా కట్ చేసుకోవాలి), క్యాప్సికం- 1 (చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి), పుదీనా- కప్పు, కొత్తిమీర- టేబుల్ స్పూన్, ఉప్పు- తగినంత, నల్లమిరియాల పొడి- కొద్దిగా, గరం మసాలా- అర టీస్పూన్, పసుపు- కొద్దిగా, కారంపొడి- 1 టీస్పూన్, చాట్ మసాలా- టీస్పూన్, నిమ్మరసం- అరటీస్పూన్
తయారీ విధానం
ముందుగా పనీర్ ముక్కలను పొడవుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని సగానికి అడ్డంగా కట్ చేయాలి. స్టవ్‌మీద కడాయిని ఉంచి కాస్త వేడయ్యాక నూనె వేయాలి. నిముషం తర్వాత వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, క్యాప్సికం వేసి రెండు నిముషాల పాటు కలపాలి. శుభ్రంగా కడిగిన పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. నల్లమిరియాల పొడి, ఉప్పు వేసి నిముషం పాటు కలపాలి. గరం మసాలా, పసుపు, కారంపొడి, చాట్ మసాలా వేసి నిముషం పాటు కలిపాక పనీర్ ముక్కలను వేసి కొద్దిగా నిమ్మరసం వేసి నిముషం పాటు కలపాలి.
పనీర్ ముక్కలు పసుపు రంగులోకి మారుతాయి. పుదీనా పనీర్ వేపుడు రెడీ.
Updated Date - Jul 06 , 2024 | 05:52 AM