ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : వెజిటెబుల్‌ కట్‌లెట్‌

ABN, Publish Date - Jul 13 , 2024 | 12:40 AM

నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర- అర టీస్పూన్‌, ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి), ఉప్పు- తగినంత, తరిగిన అల్లం ముక్కలు- అర టీస్పూన్‌, పచ్చిమిర్చి-1 (సన్నగా తరగాలి),

కావాల్సిన పదార్థాలు: నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర- అర టీస్పూన్‌, ఉల్లిపాయ-1 (సన్నగా తరగాలి), ఉప్పు- తగినంత, తరిగిన అల్లం ముక్కలు- అర టీస్పూన్‌, పచ్చిమిర్చి-1 (సన్నగా తరగాలి), క్యాబేజీ- 1 కప్పు, క్యారెట్‌- 1 (తురమాలి), తరిగిన కాలిఫ్లవర్‌- అరకప్పు, తరిగిన క్యాప్సికమ్‌ ముక్కలు- పావు కప్పు, పసుపు- చిటికెడు, కారంపొడి-అర టీస్పూన్‌, ధనియాల పొడి- అర టీస్పూన్‌, పావు బజ్జీ మసాలా- అరటీస్పూన్‌, పెప్పర్‌ పౌడర్‌- అరటీస్పూన్‌, పెద్ద బంగాళదుంప- 1, కొత్తిమీర- టేబుల్‌ స్పూన్‌, బ్రెడ్‌ -2 పీస్‌లు,

తయారీ విధానం: బంగాళదుంపను ఉడికించి మెత్తగా మ్యాష్‌ చేసుకుని పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేసి.. కాస్త వేడయ్యాక జీలకర్ర, తరిగిన ఉల్లిపాయలు, తగినంత ఉప్పు వేసి కలపాలి. అల్లం, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. నిముషం తర్వాత ఉల్లిపాయ ముక్కల రంగు మారుతుంది. వెంటనే క్యాబేజ్‌ ముక్కలు, తురిమిన క్యారెట్‌, క్యాప్సికమ్‌, కాలిఫ్లవర్‌ మిశ్రమాన్ని వేయాలి. నిముషం పాటు కలిపాక పసుపు, కారంపొడి, ధనియాల పొడి, పావుబజ్జీ మసాలా, పెప్పర్‌ పౌడర్‌ వేసి కలపాలి.

ప్యాన్‌మీద మూత ఉంచి లోఫ్లేమ్‌లో రెండు నిముషాల పాటు కుక్‌ చేయాలి. ఆ తర్వాత ప్యాన్‌పై మూత తీసి గరిటెతో కలిపాక.. బంగాళదుంప మిశ్రమం వేసి కలపాలి. కూరగాయల మిశ్రమం మెత్తగా అవుతుంది. స్టవ్‌ ఆఫ్‌ చేసి ఈ మిశ్రమాన్ని ప్లేట్‌లో వేసుకుని పక్కన ఉంచుకోవాలి.

బ్రెడ్‌ పీస్‌లను ముక్కలుగా చేసి పొడిపొడిగా మిక్సీ పట్టాలి. ఈ బ్రెడ్‌ ముక్కల పొడితో పాటు కొత్తిమీరను వెజిటెబుల్‌ మిశ్రమంలో వేసి కలపాలి. దీన్ని వడల్లా ఒత్తుకోవాలి. చదునైన ప్యాన్‌లో టేబుల్‌ స్పూన్‌ నూనె వేసి ప్యాన్‌ అంతా తిప్పిన తర్వాత ఈ కట్‌లెట్‌ను ఉంచి.. రెండువైపులా కాల్చుకోవాలి. ఈ వెజిటెబుల్‌ కట్‌లెట్స్‌ను టమోటా కెచ్‌పతో తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - Jul 13 , 2024 | 12:40 AM

Advertising
Advertising
<