ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Navya : మెల్ల కన్ను మంచిదేనా?

ABN, Publish Date - Jul 09 , 2024 | 01:39 AM

కొన్ని కనుగుడ్డు సమస్యలను బాల్యంలోనే సరిదిద్దే వీలుంది. వీటిలో ముఖ్యమైనది... ‘మెల్ల కన్ను’! ఈ సమస్యతో పుట్టిన పిల్లల్ని అలాగే వదిలేయకుండా సాధ్యమైనంత త్వరగా చికిత్స చేయించి కళ్లను సరిచేయించడం ఎంతో అవసరం!

కొన్ని కనుగుడ్డు సమస్యలను బాల్యంలోనే సరిదిద్దే వీలుంది. వీటిలో ముఖ్యమైనది... ‘మెల్ల కన్ను’! ఈ సమస్యతో పుట్టిన పిల్లల్ని అలాగే వదిలేయకుండా సాధ్యమైనంత త్వరగా చికిత్స చేయించి కళ్లను సరిచేయించడం ఎంతో అవసరం!

బాల్యంలో ‘స్ట్రాబిస్మస్‌’

నేరుగా, ఒకే తీరుగా ఉండకుండా హెచ్చుతగ్గులుగా ఉన్న కనుగుడ్ల సమస్యను వైద్య పరిభాషలో ‘స్ర్టాబిస్మస్‌’ అంటారు. కొందరికి రెండు కనుగుడ్లు ముక్కు వైపుకి తిరిగి (క్రాస్‌డ్‌ ఐస్‌) ఉండొచ్చు. ఇంకొందరికి ఒక కనుగుడ్డు పైకి, మరొకటి కిందకి ఉండొచ్చు. మరికొందరికి చెవుల వైపుకి తిరిగి (వాల్‌ ఐస్‌) ఉండొచ్చు. ఇలాంటి కనుగుడ్డు వంకరలు స్థిరంగా ఉండొచ్చు, లేదా అప్పుడప్పుడూ జరుగుతూనూ ఉండొచ్చు. పుట్టుకతోనే ఉండొచ్చు, లేదా పెరిగే క్రమంలో కనిపించవచ్చు. కొంతమందిలో ఏదైనా ప్రమాదం తర్వాతగానీ, లేదా జబ్బుపడిన తర్వాతగానీ మొదలవవచ్చు. స్ట్రాబిస్మస్‌ సమస్య మన దేశంలో 2ు పిల్లలను బాధిస్తుంటే, వారిలో సగం మందికి పుట్టుకతోనే మెల్ల కన్ను ఉంటోంది. అయితే మెల్ల కన్ను సమస్య ఒక్కొకరిలో ఒక్కోలా ఉంటుంది. ‘ఆల్టర్నేటింగ్‌ స్ట్రాబిస్మస్‌’లో మొదట ఒక కంటితో మొదలై తర్వాత రెండో కంటికి సమస్య తలెత్తుతుంది. దగ్గరి చూపు అవసరమయ్యే పనులు చేసే వారికి కూడా ఈ సమస్య రావొచ్చు.


లక్షణాలు ఇవే!

మూడేళ్లలోపు వయసులో పిల్లల కనుగుడ్లు ఎదిగే దశలోనే ఉంటాయి. ఆ సమయంలో తల్లితండ్రులు పిల్లల కనుగుడ్లలో వంకరలు, తేడాలు గమనించాలి. మెల్ల కన్ను వల్ల పిల్లలు తలను వంచి చూస్తుంటారు. అలాగే పిల్లలు అలసిపోయినప్పుడు, తక్కువ వెలుతురు ఉన్న ప్రదేశంలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఒక కనుగుడ్డు తిరిగిపోవడం, కళ్లను పదే పదే ఆర్పుతూ ఉండడం, ఎండలోకి వెళ్లినప్పుడు ఒక కంటిని మూసి ఉంచడం, కళ్లను రుద్దుకోవడం, వస్తువులను కంటికి దగ్గరగా పెట్టుకుని చూడడం... పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే కంటి వైద్యుల చేత పరీక్ష చేయించాలి. మూడు నుంచి ఐదేళ్లలోపు పిల్లలకు కచ్చితంగా కంటి పరీక్షలు చేయించగలిగితే ఈ సమస్యలను ప్రారంభంలోనే సరిదిద్దే వీలుంటుంది. ఐదారేళ్ల వయసులో పిల్లల కంటిచూపు 20/20 లేదా పెద్దల కంటి చూపుతో సమానంగా ఉంటుంది. 20/20 అంటే.. 20 అడుగు ల దూరం నుంచి కూడా నిర్దిష్ట పరిమాణంలో ఉన్న అక్షరాల ను చదవగలగడం. అయితే ఈ సామర్ధ్యం పిల్లలందరికీ ఉండదు. మూడు నుంచి ఐదేళ్ల వయసులో తలెత్తే స్ట్రాబిస్మస్‌ను గుర్తించి చికిత్స చేయించకపోతే ఆ తర్వాత అది శాశ్వత సమస్యగా ఉండిపోతుంది. దీనికితోడు మెల్ల కన్ను వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది.


చికిత్స తేలికే!

మూసుకుపోయే కన్ను: ఒక కన్ను కిందకు వాలిపోయే ‘లేజీ ఐ’ సమస్యను తొలినాళ్లలోనే పసిగట్టాలంటే పిల్లల కళ్లను తరచుగా గమనిస్తూ ఉండాలి. అలాగే పుట్టింది మొదలు ఆరు నెలలకోసారి కంటి వైద్యుల చేత పరీక్షలు చేయించాలి. పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోయే ఎలాంటి ‘లేజీ ఐ’ సమస్యనైనా చికిత్సతో సరి చేయించవచ్చు. వక్రీభవన లోపాలను కళ్లజోడుతో లేదా కాంటాక్ట్‌ లెన్సులతో సరిచేయొచ్చు. అలాగే ‘ప్లిఆప్టిక్స్‌, క్యామ్‌ స్టిమ్యులేషన్‌, బైపోలార్‌ ట్రైనింగ్‌’ అనే కంటి వ్యాయామాలతో కొంతమేరకు సమస్యలను అదుపు చేయొచ్చు. అవవసాన్నిబట్టి కంటి కండరాలకు సర్జరీ చేసి కనుగుడ్డును సరిచేయొచ్చు. ఈ సర్జరీ ఎంతో శులభం. పిల్లలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

Updated Date - Jul 09 , 2024 | 01:45 AM

Advertising
Advertising
<