TANA: తానా ఎన్నిక కథ సుఖాంతం... కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డ్ ఆమోదముద్ర
ABN, Publish Date - Mar 01 , 2024 | 01:18 PM
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లో కొత్త సభ్యుల ఎన్నికపై ప్రతిష్ఠంభన వీడింది. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఎన్నికపై నెలకొన్న వివాదం సమసిపోయింది.
ఏబీఎన్ ఇంటర్నెట్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాలో (TANA) కొత్త సభ్యుల ఎన్నికపై ప్రతిష్ఠంభన వీడింది. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు (Board) ఆమోద ముద్ర వేసింది. ఎన్నికపై నెలకొన్న వివాదం సమసిపోయింది. బోర్డ్ సమావేశంలో ఎన్నికలపై వచ్చిన ఫిర్యాదుల గురించి చర్చించారు. కంప్లైంట్లను బోర్డు సభ్యులు తోసిపుచ్చారు. కొత్తగా ఎన్నికైన బోర్డ్ సభ్యులను, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల నియామకాలకు ఆమోదముద్ర వేశారు. మార్చి 1వ తేదీ నుంచి కొత్త బోర్డ్, పాలకవర్గం సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రస్తుత తానా బోర్డ్ చైర్మన్ హనుమయ్య బండ్ల (Hanumaiah Bandla) లేఖలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 29వ తేదీన బోర్డ్ సమావేశం జరిగిందని, ఎన్నికల ఓటింగ్ పై వచ్చిన ఫిర్యాదులపై చర్చించామని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఫిర్యాదులను తోసిపుచ్చామని తెలిపారు. ఎన్నికల కమిటీ పంపిన ఫలితాలను పరిగణలోకి తీసుకున్నామని హనుమయ్య వివరించారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల ఎన్నికను బోర్డ్ ఆమోదముద్ర వేసిందని తెలియజేశారు. బోర్డ్ ఆమోదముద్ర వేయడంతో ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా నరేన్ కొడాలి, ఆయన టీమ్ బాధ్యతలను చేపట్టనుంది.
మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 01 , 2024 | 01:18 PM