TANA: తానా బోర్డు చైర్మన్‌గా డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఏకగ్రీవం
ABN, Publish Date - Mar 07 , 2024 | 08:52 AM
ఉత్తర అమెరికా తెలుగు సంఘం బోర్డు చైర్మన్ పదవి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు సమావేశంలో చైర్మన్, కార్యదర్శి, కోశాధికారిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు కార్యదర్శిగా శ్రీమతి లక్ష్మి దేవినేని, కోశాధికారిగా శ్రీ జనార్దన్ (జానీ ) నిమ్మలపూడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఏబీఎన్ ఇంటర్నెట్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ చైర్మన్ పదవి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలిని (Dr Nagendra Srinivas Kodali) సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు సమావేశంలో చైర్మన్, కార్యదర్శి, కోశాధికారిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు కార్యదర్శిగా శ్రీమతి లక్ష్మి దేవినేని, కోశాధికారిగా శ్రీ జనార్దన్ (జానీ ) నిమ్మలపూడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి టెక్సాస్ చిల్డ్రన్స్ హాస్పిటిల్‌లో పీడియాట్రిక్ కార్డియోవాస్క్యూలర్ అనస్థీషియాలజి విభాగంలో సేవలు అందిస్తున్నారు. బేలర్ కాలేజీ అఫ్ మెడిసిన్‌లో వైద్య విద్య బోధిస్తున్నారు. గతంలో తానా బోర్డు కార్యదర్శిగా, తానా- బసవతారకం ప్రాజెక్ట్‌కుకు కోటి రూపాయిల సమకూర్చారు. ఆ నగదుతో బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ రీసెర్చ్ ఇనిసిట్యూట్‌లో వైద్య పరికరాల కొనుగోలు చేశారు. వేద పాఠశాలలు, గోశాలలు, గురుకులాల, ఆలయాల అభివృద్ధికి ఆర్ధిక సాయం చేస్తుంటారు.
ఇది కూడా చదవండి: Tana: తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి
బోర్డు కార్యదర్శిగా ఎన్నికైన శ్రీమతి లక్ష్మి దేవినేని గతంలో తానా బోర్డు కోశాధికారిగా పనిచేశారు. న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్‌గా కూడా విధులు నిర్వహించారు. ఉమెన్ సర్వీసెస్ కో ఆర్డినేటర్‌గా కాకుండా 23వ తానా మహా సభలలో పలు కమిటీల్లో పనిచేశారు. బోర్డు కోశాధికారిగా ఎన్నికైన జనార్దన్ నిమ్మలపూడి గతంలో 21వ తానా మహాసభల కార్యదర్శిగా, కాపిటల్ రీజియన్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. కాన్సర్ అవగాహన, నిధుల సమీకరణ కోసం ప్రపంచంలో ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. 23వ తానా మహాసభల్లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌కి కోటి రూపాయల నిధిని సమకూర్చారు.
తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ, తానా ఫౌండేషన్‌ని సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని బోర్డు చైర్మన్ శ్రీనివాస్ కొడాలి స్పష్టం చేశారు. తానా సేవలను కమ్యూనిటీకి సమర్ధవంతంగా అందేలా కృషి చేస్తానని వెల్లడించారు. బోర్డు అఫ్ డైరెక్టర్స్ తమ మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని, తానా ప్రతిష్టని మరింత పెంచుతానని వివరించారు. తెలుగువారికి మరింత చేరువ అవడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.
మరిన్ని ప్రవాస వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇది కూడా చదవండి: Tana: తానా ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఇదే.. చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి
Updated Date - Mar 08 , 2024 | 04:41 PM