Share News

NRI: హాంగ్‌కాంగ్‌లో జేమీ లీవర్ పండించిన నవ్వుల డోలలు!

ABN , Publish Date - Apr 22 , 2024 | 09:57 PM

హాంగ్‌కాంగ్‌లో జేమీ లీవర్ పండించిన నవ్వుల డోలలు!

NRI: హాంగ్‌కాంగ్‌లో జేమీ లీవర్ పండించిన నవ్వుల డోలలు!
Indian Arts Circle

ఎన్నారై డెస్క్: 1979 మేలో ఒక సొసైటీగా నమోదైన ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఓ లాభాపేక్ష రహిత సంస్థ. సభ్యులు, సాధారణ ప్రజల (NRI) కోసం భారతీయ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం, సభ్యులలో నాటకం, సంగీతం, నృత్యం, సాహిత్యం, దృశ్య కళలపై ఆసక్తిని పెంపొందించడం, ఇలాంటి సంస్థలతో సహకరించడం దీని లక్ష్యాలు. స్థానిక ప్రతిభావంతులకు అవకాశాలను అందించడానికి ఈ బృందం ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. భారతదేశం నుండి ప్రఖ్యాత కళాకారులను కూడా ఆహ్వానిస్తుంది. భారత కాన్సుల్ జనరల్ పూర్విజ్ ష్రాఫ్ గౌరవ పోషకులు, జి.టి. గుల్ సర్కిల్ శాశ్వత సలహాదారుగా సేవలు అందజేస్తున్నారు.

NRI: కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు!

కోవిడ్ తరువాత అంటే నాలుగు సంవత్సరాల తరువాత మొదటిసారిగా ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఈ సంవత్సరం.. తెలుగు అమ్మాయి జేమీ లీవర్‌ని హాంగ్‌కాంగ్‌కు ఆహ్వానించింది. "గూన్జ్ సితారోన్ కి" అనే సాంస్కృతిక వినోద కార్యక్రమం 18 ఏప్రిల్‌న స్థానిక సిటి హా‌ల్‌లో నిర్వహించారు. పూర్వ చైర్ పర్సన్ రాణి సింగ్ , చైర్ పర్సన్ రానూ సింగ్, ఉపాధ్యక్షుడు సర్దార్ నవ్తేజ్ సింగ్, కార్యదర్శి జయ పీసపాటి, ఇతర కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.

2.jpg


చైర్ పర్సన్ రానూ సింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించటానికి భారత కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా సత్వంత్ ఖనాలియా ఆహ్వానించి సన్మానించారు. సత్వంత్ ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ చేస్తున్న అద్భుతమైన కార్యక్రమాలను, కళారులకి ఒక చక్కని వేదికని అందజేస్తున్నందుకు, వారిని ప్రోత్సహిస్తున్నందుకు ప్రశంసించారు.

3.jpgస్థానిక కళాకారుల బాలీవుడ్, హిప్ హాప్, జానపద, నృత్యాలతో, అలనాటి మధుర గీతాలతో ప్రారంభమైన ‘గూన్జ్ సితారోన్ కి” ని ప్రేక్షకులు ఆనందిస్తూ కరతాళ ధ్వనులతో కళాకారులని ప్రోత్సహించారు. అప్పుడు జేమీ లీవర్ ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటినుంచి నవ్వుల పువ్వులు పండిస్తూ జేమీ మిమిక్రీతో కామెడీ చేస్తూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్స్ హేమ మాలిని, మలైకా, దీపికా పాడుకోన్, కంగనా రనౌత్ మొదలగు వారిని అనుకరిస్తూ తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ప్రముఖ గాయని ఆశా భోంస్లే , కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, తన తండ్రి జాని లీవ‌ర్‌ల మిమిక్రీతో ఉత్తేజభరితమైన వాతావరణంతో ప్రేక్షకులని ఆనందోత్సాహాలతో ముంచేసింది. హాస్యంలో మిమిక్రీ, గానం, నృత్యం మేళవించి ఒక గంట సేపు నవ్వుల మారథాన్ చేసారు జేమీ!

4.jpg


ప్రముఖ సిని నటుడు, కమెడియన్ జాని లీవర్ అసలు పేరు జాన్ ప్రకాష్ రావు జనుముల. అయితే ఆయన హిందూస్తాన్ లేవేర్స్‌లో పని చేస్తూ స్టాండ్ అప్ కామెడి పండించి స్టాఫ్‌ని నవ్వుల డోలలూగించినప్పుడు, యాజమాన్యం ఆయనకీ 'లీవర్' అని పేరు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన ఇంటి పేరే 'జానీ లీవర్' పాపులర్ అయ్యింది.

5.jpgతెలుగు, హిందీ చిత్రరంగంలో కమెడియన్‌గా పేరొందిన ప్రముఖ నటులు తండ్రి జానీ లీవర్ ప్రతిభను పుణికి పుచ్చుకుందని జెమీ లీవర్ గురించి చెప్పడం అతిశయోక్తి కాదేమో! హాంగ్‌కాంగ్ కళా ప్రేమికుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న జేమీ తను ఇంత ఉత్సాహభరితమైన ప్రేక్షకుల మధ్య తన కళను ప్రదర్శించడం ఎంతో ఆనందంగా వుందని హర్షం వ్యక్తం చేసారు. స్థానికంగా విచ్చేసిన ప్రముఖులు, భారతీయ కన్సులార్ కుచిభోట్ల వెంకట్ రమణ తదితరులు జేమీకి తమ శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఆమె స్టాండ్ అప్ కామెడిలో గొప్ప శిఖరాలను అందుకోవాలని త్వరగా మరల హాంగ్‌కాంగ్ రావాలని స్థానికులు ఆశభావం వ్యక్తం చేసారు. అందుకు జేమీ తన చెరగని చిరునవ్వుతో అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ జేమీ గౌరవార్థం విందు భోజనం ఏర్పాటు చేసి అభినందించారు.

జేమీ ఇంస్టా లింక్: https://www.instagram.com/p/C58BqvivjhS/ https://www.instagram.com/p/C5qEy7FoTut/?img_index=1

ఇండియన్ ఆర్ట్స్ సర్కిల్ ఇంస్టా లింక్: https://www.instagram.com/p/C58IYSFy8qR/

మరిన్ని ప్రవాస వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Apr 22 , 2024 | 10:02 PM