NRI TDP: ఛార్లెట్‌లో ఘనంగా టీడీపీ ఎమ్మెల్యేల మీట్ అండ్ గ్రీట్
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:17 PM
NRI TDP: ఛార్లెట్‌లో ఎన్నారై టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. చార్లెట్‌లోని వెడ్డింగ్టన్ రోడ్డులో ఉన్న బావార్చి ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్ లో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం చంద్రబాబు అందిస్తున్న సేవలను నేతలు కొనియాడారు.

NRI TDP: ఛార్లెట్‌లో తెలుగు దేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపు రెండు వందల మంది ఛార్లెట్ ఎన్నారైలు పాల్గొన్నారు. చార్లెట్‌లోని వెడ్డింగ్టన్ రోడ్డులోని బావార్చి ఇండియన్ గ్రిల్ రెస్టారెంట్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
ఐటీ రంగంలో తెలుగువాళ్లు ఎక్కువ: ఎమ్మెల్యే కూన రవికుమార్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని అప్పటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించారని తెలిపారు. సినిమానటుడి పార్టీ అన్నవారే చివరకు ఈ పార్టీలో చేరి అధికారాన్ని అందుకున్నారని గుర్తుచేశారు. ఈరోజు అమెరికాలో ఇన్ని లక్షలమంది తెలుగువాళ్లు ఐటీ రంగంలో ముందున్నారంటే అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని ఉద్ఘాటించారు.
ఎన్నారైలు పెట్టుబడులు పెట్టాలి...
చంద్రబాబు విజనరీ ఏ రాజకీయవేత్తకు లేదని ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని, ఆయనకు ఎన్నారైలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నికల సమయంలో టీడీపీని గెలిపించేందుకు ముందుకు వచ్చినట్లే రాష్ట్రాన్ని మళ్లీ ప్రగతిబాటలో పయనించేలా చేద్దామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికోసం పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారైలు ముందుకు రావాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు.
ఎన్నారైలు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి
అనంతరం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు. ఎన్నారైలు రాష్ట్ర ప్రగతికోసం ముందుకు రావాలని కోరారు. చంద్రబాబు చేస్తున్న పనులకు, పథకాలను మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఛార్లెట్ ఎన్నారై టీడీపీ స్థానిక నాయకులు నాగ పంచుమర్తి, ఠాగూర్ మల్లినేని, రమేష్ ముకుళ్ల, సతీష్ నాగభైరవ, రాజేష్ వెలమల, ఇతర ఎన్నారై టీడీపీ కార్యవర్గ సభ్యులు సమన్వయపరిచారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీతో పాటు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
TDP Formation Day:ఫిలడెల్ఫియాలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖలు
NRI: డాలాస్‌లో టీపాడ్ బ్లడ్ డ్రైవ్.. వెల్లువెత్తిన స్పందన
Husband Marries Wife to Lover: Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..
Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి
Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు
Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్
మరిన్నీ Latest NRI News , NRI News in Telugu..