Share News

NRI NEWS: డెన్మార్క్‌లో కన్నుల పండువగా సీతారాముల కల్యాణోత్సవం

ABN , Publish Date - Apr 09 , 2025 | 08:50 PM

Sri Seetharamula Kalyanam: సీతారాముల కల్యాణోత్సవం డెన్మార్క్‌లో కన్నుల పండువగా జరిగింది. గత ఆదివారం డెన్మార్క్‌లోని తెలుగు భక్తులు అంతా ఒక దగ్గర చేరి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.

NRI NEWS: డెన్మార్క్‌లో కన్నుల పండువగా సీతారాముల కల్యాణోత్సవం
Sri Seetharamula Kalyanam

NRI NEWS: డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ (DTA) గత ఆదివారం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగెన్‌లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు సమాజం పెద్ద ఎత్తున పాల్గొని, సంప్రదాయ వేడుకలను ఘనంగా చేసుకున్నారు. ఉదయం 8:00 గంటలకు శ్రీ లక్ష్మణ హనుమాన సమేత సీతారాముల అభిషేకంతో ప్రారంభమైన ఈ వేడుక, కల్యాణం, పల్లకిసేవ, సహస్ర దీపాలంకరణ వంటి కార్యక్రమాలతో సాయంత్రం 8:00 గంటల వరకు వేద మంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయబద్ధంగా జరిగింది.

Sri-Seetharamula-Kalyanam-2.jpg


ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, డెన్మార్క్‌లోని భారత రాయబారితో సహా దాదాపు 1200 మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని, శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించి తరించారు. ఈ విజయవంతమైన కార్యక్రమం తర్వాత, డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ వారు, మన సంస్కృతి అనే మరో హిందు ధార్మిక సంస్థతో కలిసి వచ్చే మూడు వారాంతాల్లో డెన్మార్క్, స్వీడన్‌లోని పలు నగరాల్లో సీతారామ కల్యాణోత్సవాలను, హనుమాన్ జయంతోత్సవాలను నిర్వహించాలని సంకల్పించి, ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా భారతదేశ సంప్రదాయాలను, ప్రత్యేకించి తెలుగు సంస్కృతిని మరింత విస్తృతంగా ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

Sri-Seetharamula-Kalyanam-6.jpg


డెన్మార్క్‌లో నివసిస్తున్న తెలుగు వారు తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ గత 15 సంవత్సరాలుగా చాలా పండుగలు, ఉత్సవాలను నిర్వహిస్తోందని డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు పొట్లూరి అమరనాథ్ తెలిపారు. సంక్రాంతి, ఉగాది, దసరా వంటి పండుగలతో పాటు, వినాయక చవితి, సీతారాముల కల్యాణోత్సవం వంటి ముఖ్యమైన ఉత్సవాలను ప్రతి ఏడాది ఘనంగా జరుపుతూ, తెలుగు సంప్రదాయాలకు జీవం పోస్తున్నారని చెప్పారు. ప్రతీ కార్యక్రమంలో స్థానిక సమాజ సభ్యులు ఐకమత్యంతో కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారని పొట్లూరి అమరనాథ్ అన్నారు.

Sri-Seetharamula-Kalyanam-7.jpg


మన తెలుగు సంస్కృతిని విదేశాల్లో ఇలా చేసుకోవడం తమకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తుందని పొట్లూరి అమరనాథ్ తెలిపారు. ఇది తర్వాతి తరానికి మన సంస్కృతి గొప్పతనాన్ని అందజేసే అవకాశాన్ని ఇస్తుందని డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపకుడు పొట్లూరి అమరనాథ్ పేర్కొన్నారు. సొంత ఊరికి దూరంగా ఉన్నప్పటికీ, తెలుగు వారు ఐకమత్యంతో సంప్రదాయాన్ని కొనసాగించడం చాలా సంతోషాన్ని ఇస్తుందని డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు రవి గంగం, కార్యనిర్వాహక సభ్యులు తెలిపారు. డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ తెలుగు వారి ఐక్యతకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమాల ద్వారా భవిష్యత్ తరాలకు కూడా మన సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. వారు చేస్తున్న కృషి సర్వదా ప్రశంసనీయమని డెన్మార్క్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు రవి గంగం, కార్యనిర్వాహక సభ్యులు పేర్కొన్నారు.

Sri-Seetharamula-Ka-14.jpg


Sri-Seetharamula-Ka-12.jpg


Sri-Seetharamula-Kalyanam-5.jpg


Sri-Seetharamula-Kalyanam.jpg


ఈ వార్తలు కూడా చదవండి..

TDP Formation Day:ఫిలడెల్ఫియాలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ వేడుకలు.. పాల్గొన్న ప్రముఖలు

NRI: డాలాస్‌లో టీపాడ్ బ్లడ్ డ్రైవ్.. వెల్లువెత్తిన స్పందన

Husband Marries Wife to Lover: Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..

Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి

Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు

Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్

మరిన్నీ Latest NRI News , NRI News in Telugu..

Updated Date - Apr 09 , 2025 | 09:37 PM